Sundeep Kishan : ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు సందీప్ కిషన్. ప్రస్థానం , స్నేహ గీతం వంటి సినిమాలు సందీప్ కు మంచి పేరుని తీసుకొచ్చాయి. మెర్లపాక గాంధీ దర్శకుడుగా పరిచయమైన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. రొటీన్ లవ్ స్టోరీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నగరం వంటి సినిమాలు తన కెరీర్ కి బాగా ప్లస్ అయ్యాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ దర్శకులతో సందీప్ కి మంచి బాండింగ్ ఉంది. సందీప్ కూడా తమిళ్ చాలా అలవోకగా మాట్లాడుతాడు. లోకేష్ కనగరాజ్ దర్శకుడుగా పరిచయమైన సినిమాలో సందీప్ హీరో. ఇక ప్రస్తుతం సందీప్ ఇళయ దళపతి విజయ్ కుమారుడు జాసన్ విజయ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మామూలుగా స్టార్ హీరో కుమారులు సినిమాల్లోకి రావాలని చాలామంది ఆ యొక్క హీరో అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. విజయ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ విజయ్ కు ఉంటుంది. విజయ్ కొడుకు కూడా నటుడుగా సినిమాల్లోకి ఎంటర్ ఇస్తాడు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తాను దర్శకుడుగా మారాడు.
ఇక సందీప్ కిషన్ తో చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఆ సినిమాకి సంబంధించి టైటిల్ రివిల్ చేయలేదు. ఎట్టకేలకు ఈ మంత్ అండ్ లోపు సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల కానుంది.
ఈ సినిమాను మొదట జాషన్ విజయ్ దుల్కర్ సల్మాన్ కి చెప్పారు. అయితే సినిమా కాన్సెప్ట్ నచ్చిన కూడా కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దుల్కర్ ఈ ప్రాజెక్టును మిస్ చేసుకోవడం వలనే, సందీప్ కు అవకాశం దక్కింది.
ఇక జాషన్ విజయ్ దర్శకుడిగా చాలా బాగా చేస్తున్నట్లు ఇదివరకే పలు ఇంటర్వ్యూస్ లో సందీప్ కిషన్ చెప్పాడు. అయితే చాలామందికి కూడా ఒక రకమైన క్యూరియాసిటీ నెలకొంది. మరోవైపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు కొడుకులు కూడా దర్శకులుగా మారుతున్నారు. రవితేజ కొడుకు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ గా, వెంకీ అట్లూరి, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు దగ్గర పనిచేస్తున్నాడు. నెక్స్ట్ వీళ్ళ కూడా దర్శకులుగా మారి ఏ రేంజ్ సినిమాలు చేస్తారో అని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. రవితేజ కుమారుడు రవితేజ తో సినిమా చేసే అవకాశం ఉన్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.
Also Read: Suriya46 : వెంకీ అట్లూరి, సూర్య సినిమా ఓటీటీ బిజినెస్ అయిపోయింది, ఎన్నికోట్లో తెలుసా?