Court film: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అదేవిధంగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న సినిమాలలో కోర్టు చిత్రం (Court Movie)ఒకటి. కేవలం నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే బజ్ తప్ప ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుమారు 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ప్రశంసలు కురిపించిన మెగాస్టార్..
హర్ష రోషన్(Harsha Roshan), శ్రీదేవి(Sridevi) హీరో హీరోయిన్లుగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గత కొన్ని నెలల క్రితం తెలుగులో విడుదలయి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో మంగ పతి పాత్రలో నటుడు శివాజీ తన అద్భుతమైన నటనతో అదరగొట్టారని చెప్పాలి. కోర్టు రూమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సైతం ప్రశంశలు కురిపించడం విశేషం. ఇలా ఒక భాషలో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను ఇతర భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటారు. ఈ క్రమంలోనే కోర్టు సినిమాని తమిళంలో (Tamil) రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది.
హీరోయిన్ గా స్టార్ డాటర్?
ఈ సినిమా తమిళ హక్కులను ప్రముఖ నిర్మాత కతిరేసన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులను కూడా ప్రారంభించుకోబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా ప్రముఖ నిర్మాత కతిరేసన్ కుమారుడు కృతిక్(Kruthik) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అదేవిధంగా హీరోయిన్ గా ప్రముఖ నటి దేవయాని కుమార్తె ఇనియా(Iniya) హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రియదర్శి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ నటించబోతున్నట్ల సమాచారం. ఇక త్యాగరాజన్ సినిమాకు దర్శకుడిగా పని చేయబోతున్నారని తెలుస్తోంది. అదేవిధంగా సాయికుమార్ పాత్రలో కూడా ఈయనే నటించబోతున్నట్టు సమాచారం.
తమిళంలో రీమేక్..
తెలుగులో ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా, నాని నిర్మాతగా మారి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తెలుగులో సుమారు పది కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 50 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళ భాషకు అనుకూలంగా కొన్ని కొన్ని మార్పులు చేస్తూ అక్కడ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు కూడా అధికారకంగా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vijay Devarakonda: గర్ల్ ఫ్రెండ్ తో సమయం గడపలేదు.. రష్మిక మిస్ అవుతున్న రౌడీ హీరో?