Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gawtham Tinnanuri)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కింగ్ డం(King Dom) అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా తాను బ్రతుకుతున్న జీవితం తనకే ఏమాత్రం నచ్చలేదని ఈయన తెలియజేశారు.
సమయాన్ని ఇవ్వలేకపోతున్నా…
“గత మూడు సంవత్సరాలుగా తాను కుటుంబంతో సరైన సమయం గడపలేదని, అదేవిధంగా తన గర్ల్ ఫ్రెండ్ తో కూడా సరైన సమయం గడపలేదని తెలిపారు. ప్రస్తుతం నా పద్ధతులకు మార్చుకున్నాను అని వాళ్లకోసం నేను నా సమయాన్ని కేటాయిస్తున్నానని” విజయ్ దేవరకొండ తెలియజేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ ఎవరా? అంటూ మరోసారి చర్చలు మొదలయ్యాయి.
రిలేషన్ లో విజయ్, రష్మిక?
ఇలా గర్ల్ ఫ్రెండ్ తో కూడా సమయం కేటాయించలేకపోతున్నాను అంటూ ఈయన మాట్లాడిన మాటలు తప్పకుండా రష్మిక (Rashmika)ను ఉద్దేశించి మాట్లాడారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి వెకేషన్ లకి వెళ్లడం, ఇద్దరూ ఒకే చోటే దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు వీరి రిలేషన్ గురించి పరోక్షంగా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వీరి రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. వీరిద్దరి వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం అతి త్వరలోనే తమ రిలేషన్ గురించి బయట పెట్టబోతున్నారని తెలుస్తోంది.
రష్మిక గురించేనా?
విజయ్ దేవరకొండ రష్మిక మొదటిసారి గీతాగోవిందం సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని చెప్పాలి. దీంతో అప్పటినుంచి వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వార్తలు రావడమే కాకుండా తదుపరి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసిన నటించడంతో ఈ వార్తలు నిజమేనని అభిమానులు భావించారు. ఇలా తమ గురించి ఎన్నో రూమర్లు వస్తున్న విజయ్ దేవరకొండ గాని, రష్మిక గాని ఈ వార్తలను ఖండించలేదు. ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న నేపథ్యంలోనే తనతో సరైన సమయం గడపలేకపోతున్నాను అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ రష్మిక గురించి కామెంట్లు చేశారని అభిమానులు భావిస్తున్నారు.. మరి ఈయన చెప్పిన ఆ గర్ల్ ఫ్రెండ్ రష్మిక నేనా? ఎవరైననా? అనేది తెలియాలి అంటే విజయ్ దేవరకొండనే స్పందించాల్సి ఉంటుంది .
Also Read: lavanya -Varun Tej: పుట్టబోయే బిడ్డ కోసం అయోమయం .. మెగా హీరో తిప్పలు మామూలుగా లేవే?