BigTV English

SSMB29: వంద మంది స్టంట్ మాస్టర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్.. హైదరాబాద్ లో స్పెషల్ సెట్.. జక్కన్న భారీ స్కెచ్

SSMB29: వంద మంది స్టంట్ మాస్టర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్.. హైదరాబాద్ లో స్పెషల్ సెట్.. జక్కన్న భారీ స్కెచ్


SSMB29 Latest Update: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి సినిమా అంటే మూవీ లవర్స్ కి పండగే. జక్కన్న విజన్, దర్శకత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన స్టోరీ ఎంపికే కొత్త గా ఉంటుంది. కాబట్టి.. రాజమౌళి సినిమా అంటే బాక్సాఫీసు రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందే అనేట్టుగా మారింది. అలాంటి ఆయన ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. పాన్ వరల్డ్ గా యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

వంద మంది స్టంట్ మాస్టర్స్ తో యాక్షన్


ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను ఎక్కువ భాగంగా అడవుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అమెరికాలోని భయంకరమైన అమెజాన్ అడవి బ్యాక్ డ్రాప్ ఈ సినిమా ఉండనుంది. అడవుల్లో అడ్వెంచర్ గా వస్తున్న ఈ సినిమా ఇటీవల ఒరిస్సాలో షూటింగ్ ని జరుపుకుంది. ఆ తర్వాత విదేశాల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎస్ఎస్ఎంబీ 29 టీం ఇండియాకు వచ్చింది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి జక్కన్న భారీ స్కేచ్ వేశాడట. తాజాగా SSMB29 మూవీకి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్ నగర శివారులో వంద మంది స్టంట్ మాస్టర్స్ తో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నాడట.

జక్కన్న ఫాంహౌజ్ లో ఆడియో వర్క్

ప్రస్తుతం దీనికి సంబంధించిన రిహార్సల్స్ జరుపుకుతున్నారట. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ. అక్కడ ప్రస్తుతం స్టంట్స్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీన్ కి సంబంబధించిన రిహార్సల్స్ జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ మూవీ ఆడియోని కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడట జక్కన్న. ఎంఎం కీరవాణి అప్పుడే మ్యూజిక్ పనులు స్టార్ట్ చేశారట. రాజమౌళి ఫాం హౌజ్ లో ఆడియో అల్భమ్ కి సంబంధించి కంపోజింగ్ పనులు జరుగుతున్నాయట. మ్యూజిక్ పై జక్కన్నప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దగ్గరుండి మరీ కంపోజింగ్ వర్క్ ని చూసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎంఎం కీరవాణి, ఆయన టీం మూవీ ఆడియో ఆల్బమ్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్నారట. ఈ రెండు అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి.

ఇటూ షూటింగ్ తో పాటు సినిమా ప్రమోషన్స్, ఆడియో వర్క్ కూడా చకచక జరుపుతున్నారు. రాజమౌళి స్పీడ్ చూస్తుంటే వచ్చే ఏడాదిలోనే SSMB29ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా కనిపిస్తున్నాడు. తదుపరి షెడ్యూల్ ఆఫ్రికాలో జరగనుందట. వచ్చే నెల ఆగష్టు సెకండ్ వీక్ లో మూవీ టీం అంత ఆఫ్రికా వెళ్లనుందని టాక్. ఇదిలా ఉంటే ముందు నుంచి SSMB29 షూటింగ్ విషయంలో జక్కన్న గొప్యత పాటిస్తున్నారు. సినిమా లాంచ్ కార్యక్రమం నుంచి షూటింగ్ వరకు ప్రతిదీ రహస్యంగా కానిచ్చేస్తున్నారు. సైలెంట్ షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నాు. జక్కన్న ఒక్క అప్డేట్ వదలండి.. అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్, ఇండోఅమెరికన్ నటి ప్రియాంక చోప్రా, మలయాళి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Anchor Suma Assets: యాంకర్ సుమ ఇంత సంపాదించిందా? ఆమె ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు!

Related News

Tamil Actor: తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..

Ravi Basrur: ఊరు పేరునే తన పేరుగా మార్చుకున్న సంగీత దర్శకుడు.. అసలు పేరేంటంటే ?

Director Bobby: ‘మన శంకర వరప్రసాద్‌ గారూ’ మూవీపై డైరెక్టర్‌ బాబీ రివ్యూ.. ఏమన్నారంటే!

OG Tickets : ఆంధ్రాలో ఓజి బుకింగ్స్ ఓపెన్, ఊచకోత మొదలైంది. తెలంగాణలో అప్పుడే

Deepika Padukone: దీపికా ఎక్కడా? నువ్వు స్పందించే టైం వచ్చింది..

Mirai – Kishkindhapuri : కలెక్షన్స్‌లో మిరాయ్‌ ని దాటేసిన కిష్కంధపురి.. ఇదెక్కడి ట్విస్ట్ అసలు

Kalki 2 Movie : దీపికను తప్పించడానికి కారణాలు ఇవే… 30 కోట్లు ప్లస్ టీంకు ఖర్చులు.. ఇంకా మరెన్నో

Malayalam Actress: మోహన్‌ లాల్‌పై సీనియర్‌ నటి సంచలన కామెంట్స్‌.. నా భర్త చనిపోతే.. స్వార్థ బుద్ధితో..

Big Stories

×