E-Paper
Advertisement

5 కోట్ల మూవీకి 26 కోట్లు ఖర్చు.. మహేంద్రగిరి వారాహి మూవీ బడ్జెట్ పై నిర్మాత రియాక్షన్?

5 కోట్ల మూవీకి 26 కోట్లు ఖర్చు.. మహేంద్రగిరి వారాహి మూవీ బడ్జెట్ పై నిర్మాత రియాక్షన్?
Advertisement

Mahendragiri Varahi: అక్కినేని కాంపౌండ్ నుండి ఇండస్ట్రీకి వచ్చిన హీరో సుమంత్(Sumanth ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. విభిన్నమైన పాత్రలతో ఆడియన్స్ కి దగ్గరయ్యారు. హీరో గానే కాకుండా విలన్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమంత్.. ఈమధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో కూడా అలరిస్తున్నారు. అలాంటి ఈయన చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘మహేంద్రగిరి వారాహి’ అనే మైథాలజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ.. సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ .

5 కోట్లు బడ్జెట్ అనుకున్న మూవీకి 26 కోట్ల ఖర్చు..

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో సినిమా బడ్జెట్ పై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నిర్మాత ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రెస్ మీట్ లో భాగంగా..” రూ.5కోట్లు బడ్జెట్ అనుకున్న మూవీకి రూ.26 కోట్లు ఖర్చు పెట్టారట. నిజమేనా?” అని ప్రశ్నించగా నిర్మాత ఇలా స్పందించారు. “ముందుగా బడ్జెట్ కి రూ.5 కోట్లు అన్న విషయం పక్కన పెడితే.. సినిమా కథ విన్నప్పుడే ఈ సినిమాను చాలా గట్టిగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఉదాహరణగా నేను రంగమార్తాండ సినిమా చేశాను. దానికి 10 కోట్లు ఖర్చయింది. అలాగే బాహుబలి సినిమా రాజమౌళి గారు చేశారు. దానికి రూ.100 కోట్లు ఖర్చయింది. 10 కోట్లు విలువ చేసే రంగమార్తాండకి 100 కోట్లు బడ్జెట్ పెట్టలేము.. అలాగే 100 కోట్ల బడ్జెట్ అయ్యే బాహుబలి మూవీని 10 కోట్లలో ముగించలేము కదా.. స్టోరీ డిమాండ్ ను బట్టి బడ్జెట్ కూడా మారుతూ ఉంటుంది.

Advertisement

also read:హీరోయిన్స్ కి డ్రీమ్ రోల్ పడాలంటే వారి వల్లే సాధ్యం.. మాళవిక బోల్డ్ కామెంట్స్!

బడ్జెట్ పెరగడంపై నిర్మాత క్లారిటీ..

ముఖ్యంగా స్టోరీని బట్టి చూస్తే మహేంద్రగిరి వారాహి సినిమా ఫుల్లుగా సీజీ వర్క్ పైన డిపెండ్ అయ్యింది. 57 మినిట్స్ సీజీ వర్క్ ఉంది. పైగా అవుట్ డోర్లో ఎక్కువ భాగం షూటింగ్ చేశాము. పెద్దపెద్ద టెంపుల్ సెటప్ వేసాము. గండికోటలో సినిమా షూటింగ్ చేశాము. ముఖ్యంగా ఒక 25 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని కూడా సెట్ వేసాము. ఒరిస్సాకి కూడా వెళ్ళాము. రామచంద్రాపురం కోటలో కూడా ఈ సినిమా షూటింగ్ చేశాము. పెద్ద పెద్ద సెట్లు వేసాము. చాలా ఎక్కువ పని జరిగింది. ఈ సినిమాను అలా చేస్తేనే చేయాలి..లేకపోతే చేయకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నాము. బడ్జెట్ వేసినప్పుడే మాకు తెలిసింది ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని. ఇక నమ్మి ఈ సినిమా చేసాము. కాబట్టి మాకు మంచి రిజల్ట్ వచ్చింది అంటూ నిర్మాత మధు కలిపు (Madhu Kalipu) క్లారిటీ ఇచ్చారు.

మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి..

Advertisement

సినిమా విషయానికి వస్తే.. సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కీలక పాత్ర పోషిస్తున్నారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మధు కలిపు , సురభి లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి హీరోయిన్గా నటిస్తుండగా.. శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్ ,మాళవికా నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

ఆగస్టు 9న ‘దూకుడు’ రీ-రిలీజ్.. మళ్లీ బాక్సాఫీస్ షేక్ అవుతుందా?

ఒడిశా అమ్మాయి సంచలనం.. ఇండియన్ ఐడల్ 16 విన్నర్‌గా జ్యోతిర్మయి నాయక్!

హీరోయిన్స్ కి డ్రీమ్ రోల్ పడాలంటే వారి వల్లే సాధ్యం.. మాళవిక బోల్డ్ కామెంట్స్!

ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్….రూ.2000 కోట్ల రికార్డు కొట్టేది ఈ హీరోనేనా?

రామాయణ కోసం సాయి పల్లవి రెమ్యూనరేషన్?

ఆదర్శకుటుంబం.. వెంకీ మామ ఎంట్రీ సీన్ రిలీజ్, ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఎన్టీఆర్ మూవీలోకి మరో స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్రలో అంటే!

Big Stories

Advertisement
×