Mohammed Shami Fires On Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వైపు బంతి వచ్చిందంటే చాలు… చురుకు వేగంతో పట్టుకొని ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేస్తూ ఉంటాడు కోహ్లీ. చాలా రనౌట్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. క్యాచ్ లు పట్టడంలో నిజంగా కోహ్లీ కింగ్ అని చెప్పవచ్చు. అలాంటి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ గురించి టీమిండియా డేంజర్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ చెత్త ఫీల్డింగ్ కారణంగా.. బ్రెండన్ మెక్‌కలమ్ ( Brendon McCullum) 300 బాదేశాడని గుర్తు చేశారు. 9 పరుగుల వద్ద ఔట్ కావాల్సిన బ్రెండన్ మెక్‌కలమ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ మిస్ (Virat Kohli dropped Brendon McCullum) కారణంగా త్రిపుల్ సెంచరీ సాధించాడని మండిపడ్డారు. కోహ్లీ చేసిన తప్పిదం వల్ల టీమిండియా కొంప మునిగిందని వ్యాఖ్యానించారు షమీ. దీంతో షమీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2014 సమయంలో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో అప్పటి న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ( Brendon McCullum) 9 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ షమీ బౌలింగ్ చేశాడు. అయితే బ్రెండన్ మెక్‌కలమ్ ను ఔట్ చేసేందుకు.. మహమ్మద్ షమీ అదిరిపోయే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే సిల్లీ మిడ్ డాన్ దగ్గర విరాట్ కోహ్లీని ఫీల్డింగ్ చేయమని షమీ కోరాడు. దానికి తగ్గట్టుగానే ఫ్రంట్ లో నిలబడ్డాడు కోహ్లీ. ఆ సమయంలో బ్రెండన్ మెక్‌కలమ్ భారీ షాట్ ఆడగా, కోహ్లీ చేతిలోకి బంతి వెళ్ళింది. అయితే కాస్త నిర్లక్ష్యంగా ఉన్న విరాట్ కోహ్లీ… ఆ క్యాచ్ అందుకోలేక పోయాడు.
ఈ క్రమంలోనే బ్రెండన్ మెక్‌కలమ్ కు మంచి లైఫ్ వచ్చింది. ఆ లైఫ్ అందుకున్న బ్రెండన్ మెక్‌కలమ్, రెండున్నర రోజుల పాటు బ్యాటింగ్ చేశాడు. ఏకంగా 302 పరుగులు చేశాడు. అయితే, బ్రెండన్ మెక్‌కలమ్ క్యాచ్ మిస్ అయిన సమయంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను షమీ తాజాగా గుర్తు చేశాడు. 9 పరుగుల వద్ద క్యాచ్ మిస్ అయిన తరుణంలో టెన్షన్ వద్దని తనతో కోహ్లీ చెప్పినట్లు తెలిపారు. తొందరగా బ్రెండన్ మెక్‌కలమ్ ను ఔట్ చేస్తామని వివరించాడట. కానీ సీన్ రివర్స్ అయిందని షమీ వెల్లడించారు. ఏకంగా 302 పరుగులు బ్రెండన్ మెక్ కలమ్ సాధించి, టీమిండియా కొంపముంచాడని షమీ చెప్పుకొచ్చారు. ఇలా కోహ్లీ చేసిన తప్పిదం, మెక్ కలమ్ ట్రిపుల్ సెంచరీ చేసుకునేదానికి ఉపయోగపడినట్లు వెల్లడించారు.