Naga Vamsi: ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ పెద్దగా ప్రేక్షక ఆదరణ మాత్రం నోచుకోలేకపోతున్నాయి. సినిమాలు థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదని చెప్పాలి. ఇలా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో సినిమా విడుదలైన నాలుగు వారాలకే తిరిగి ఓటీటీలో విడుదల(Ott Release) కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా కోసం డబ్బులు ఖర్చు చేసి థియేటర్లకు వెళ్లడం ఇష్టం లేక సినిమాలు ఓటీటీలో విడుదలైన తర్వాత మాత్రమే చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
పాప్ కార్న్ రేటు ఎక్కువ..
ఇకపోతే పెరిగిన సినిమా టికెట్ల ధరల కారణంగా చాలామంది కుటుంబంతో కలిసి థియేటర్ వెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. అలాగే కొన్ని థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లు(Ticket Price) తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడ దొరుకుతున్నటువంటి పాప్ కార్న్(Popcorn), కూల్ డ్రింక్స్ ధరలు భరించలేక థియేటర్లకు దూరమవుతున్నారు. అయితే తాజాగా మల్టీప్లెక్స్ లలో పాప్ కార్న్ ధరల గురించి ప్రముఖ నిర్మాత నాగ వంశీ(Nagavamshi) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ… మల్టీప్లెక్స్ లలో పాప్ కార్న్ ధరలు సినిమా టికెట్ ధరలకంటే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపాలి…
మల్టీప్లెక్స్ లలో పాప్ కార్న్ ధరలు చూసి తాను భయపడ్డానని నాగ వంశీ తెలిపారు. ఇలా ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుతూ పోతుంటే థియేటర్లకు ఎవరూ రారని, ధరల క్రమబద్ధీకరణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ఈయన తెలియజేశారు. ఈ విషయంలో తాను ప్రభుత్వ పెద్దలను కలిసి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా నాగ వంశీ తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే త్వరలోనే నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
నెల వ్యవధిలోనే మూడు సినిమాలు..
నాగ వంశీ నిర్మాణం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్ డం(King Dom). ఈ సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే ఈయన పాప్ కార్న్ ధరల గురించి మాట్లాడారు. అదేవిధంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్2 తెలుగు హక్కులను నాగ వంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అదేవిధంగా రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన మాస్ జాతర సినిమాకు కూడా నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఆగస్టు 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా నెల వ్యవధిలోనే నాగ వంశీ నుంచి మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
Also Read: Kiara advani: కూతురు ఫోటో రివీల్ చేసిన కియారా.. ఎంత ముద్దుగా ఉందో?