Kiara advani: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కియారా అద్వానీ (Kiara Advani)గత రెండు సంవత్సరాల క్రితం సినీ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను (Siddarth Malhotra)ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే తాజాగా ఈ దంపతులు పండంటి ఆడబిడ్డకు(Baby Girl) జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే కియారా ప్రెగ్నెన్సీ ప్రకటించినప్పటి నుంచి ఆమెకు డెలివరీ అయ్యే వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కనీసం తన బేబీ బంప్ కూడా మీడియా కంటికి కనపడకుండా జాగ్రత్తలు పడ్డారు.
కుమార్తె ఫోటోని రివీల్
ఇలా తన బిడ్డ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఈ జంట తాజాగా తన కుమార్తె ఫోటోని రివీల్ చేశారు అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భాగంగా సినీ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కూడా ఉండటం విశేషం. సల్మాన్ ఖాన్ కియారా కుమార్తెను చూడటానికి వెళ్ళిన సమయంలో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అంటూ ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో నిజమైనది కాదని అభిమానులు కియారాతో పాటు సల్మాన్ ఖాన్, సిద్దార్థ్ మల్హోత్రా అలాగే ఒక చిన్న పాప ఫోటోను కలిపి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తోంది.
మీ దీవెనలు కావాలి…
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నిజంగానే కియారా తన కుమార్తె ఫోటోని షేర్ చేశారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే తన కుమార్తె విషయంలో కియారా చాలా గోప్యతను ప్రదర్శిస్తున్నారు. తన కుమార్తె ఫోటోలు మీడియా కంటికి కనపడకుండా జాగ్రత్తపడ్డారు. అదే విధంగా దయచేసి ఎవరూ కూడా ఫోటోలు తీయడానికి ప్రయత్నించవద్దు అంటూ మీడియాని రిక్వెస్ట్ చేసుకోవడమే కాకుండా తన కుమార్తెకు మీ అందరి దీవెనలు కావాలని మీడియాని కోరారు. ఇలా తన కుమార్తె ఫోటోని రివీల్ చేయని నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో నిరాశ..
ఇక కియారా విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయితే తిరిగి మరోసారి రాంచరణ్ తో కలిసి ఈమె గేమ్ ఛేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ మాత్రం నోచుకోలేకపోయింది. ఇక త్వరలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2(War 2) సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈమె ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
Also Read: Mohan Lal: ఫస్ట్ టైం అలాంటి యాడ్ చేసిన హీరో.. తేడా కొడుతుందంటున్న నెటిజన్స్?