Hebah Patel:హెబ్బా పటేల్.. కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలు తగ్గించినా కానీ సోషల్ మీడియాలో తన అందంతో నెటిజన్లని ఫిదా చేస్తుంది.ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు పర్సనల్ ఫోటోలని, ఫ్యాషన్ ఫోటోషూట్లని షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.
ముఖ్యంగా హలో వీన్స్ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో స్టైలిష్ గా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ తో తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఫోటోలు కి ఫోజులు ఇవ్వడంతో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్ .సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా ఈ బ్యూటీ ఫ్యాషన్ విషయంలో తనకు అంటూ ప్రత్యేకమైన స్టైల్ మెయింటెయిన్ చేయడం విశేషం. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలలో సింపుల్ మేకప్ తో క్యాజువల్ హెయిర్ స్టైల్ తో కనిపించింది. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఆరెంజ్ కలర్ సోఫా ఈ ఫోటోలకి మరింత అందం తీసుకువచ్చిందనే చెప్పాలి .ఇక ఆమె పెట్టిన .Trick or treating!’ క్యాప్షన్ ఈ పోస్ట్ కి మరింత స్పెషాలిటీ తీసుకొచ్చింది.
అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా హలో వీన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు కూడా తమవైన ఫొటోస్ ,ని కాస్ట్యూమ్స్ ని, క్రియేటివి లుక్స్ ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. హలో వీన్స్ అనగానే భయపెట్టే దుస్తులు, భయపెట్టే చిత్ర విచిత్రమైనదయ్యాలు గెటప్స్ అనేవి మనకి గుర్తుకొస్తాయి అయితే క్రమక్రమంగా అది భయపెట్టే డ్రెస్ మాత్రమే కాకుండా ఫ్యాషన్ ఫోటోషూట్లు, సరదా ఈవెంట్స్ గా మారిపోయింది.
ఇక హెబ్బా పటేల్ కెరీర్ విషయానికి వస్తే, ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో యూత్ ని తనదైన అందంతో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’, ‘అంధగాడు’ వంటి చిత్రాల్లో నటించి ఆడియన్స్ కి మరింత దగ్గరైంది.
ఇక సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకి మంచి ఫాలోయింగే ఉంది. ముఖ్యంగా ఈ అమ్మడు పెట్టే ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులు షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు. కొన్ని కొన్ని సార్లు ట్రెడిషన్ లుక్ లో కనిపిస్తే మరి కొన్నిసార్లు మోడ్రన్ అవుట్ ఫిట్స్ తో రచ్చ చేస్తుంది ముద్దుగుమ్మ. అందుకే ఈ అమ్మడు పెట్టే ఫోటోల కోసం ఎదురు చూస్తుంటారు అభిమానులు. ఇదే క్రమంలో తాజాగా Trick or treating! అంటూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి!
ALSO READ :గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!