E-Paper
Advertisement

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్

ఆ ఏడు రోజులు నిద్రపోలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్
Advertisement

Rajeev Kanakala: రాజీవ్ కనకాల తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా తన జీవితంలో ఎదురైన విషాదకరమైన సంఘటనల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.కేవలం నటుడిగానే కాకుండా ఒక కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రెండేళ్ల సమయంలోనే నే తల్లిదండ్రులను, చెల్లిని కోల్పోయిన సంఘటనలు తనని మానసికంగా ఎంతగా కుంగదీసిందో చెప్పుకొచ్చారు.

రాజీవ్ కనకాల మాట్లాడుతూ తన కెరీర్ ద్వారా సంపాదించిన మొత్తంలో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు జాగ్రత్తగా నిలబెట్టుకోగలిగానని రాజీవ్ చెప్పుకొచ్చారు. కొన్ని పెట్టుబడుల కారణంగా ఫైనాన్షియల్ గా సేఫ్ గా ఉన్నానని తెలిపారు.ఇక తన కుటుంబంలోతల్లి, తండ్రి, చెల్లిని కేవలం రెండేళ్ల సమయంలోనే కోల్పోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. మొదట తల్లిని కోల్పోవడం తనకు పెద్ద షాక్ అని చెప్పారు. చిన్నప్పటి నుంచి తల్లి అంటే ఎంతో అనుబంధం ఉండేదని, ఆమె లేని లోటును భరించడం చాలా కష్టమైందని తెలిపారు. అయితే అప్పటికే తనకంటూ కుటుంబం, పిల్లలు ఏర్పడటంతో జీవితంపై ఆలోచనలు మారాయని చెప్పారు. అయినప్పటికీ తల్లి మరణం కలిగించిన బాధ నుంచి బయటపడకముందే తండ్రిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తండ్రి మరణం గురించి చెబుతూ ఆయన ఒక అనుకోని సంఘటన కారణంగా ఆసుపత్రి పాలయ్యారని వివరించారు. అప్పటివరకు ఆరోగ్యంగానే ఉన్న తన తండ్రికి ఒక ప్రమాదం జరగడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అప్పటికే బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉండటంతో ట్రీట్మెంట్ అప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ దెబ్బతింటూ వచ్చిందని తెలిపారు. దాదాపు 30 నుంచి 32 రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్నప్పటికీ తండ్రిని కాపాడుకోలేకపోయానని బాధపడ్డారు. తండ్రి మరణం తనను మానసికంగా తీవ్రంగా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తల్లిదండ్రుల మరణాల కంటే తన చెల్లెలి విషయంలో ఎదుర్కొన్న పరిస్థితులు మరింత బాధించాయని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. తన చెల్లెలికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని, అయితే ఆ విషయాన్ని ఆమె మొదట్లో ఎవరికీ చెప్పుకోలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆడవాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ శరీరంలో ఏవైనా మార్పులు కనిపించినా, ముఖ్యంగా రొమ్ముల్లో గడ్డలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్స్ ని కలవాలని సూచించారు. భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పడానికి భయపడకుండా
సమస్యను చెప్పాలని కోరారు.

Advertisement

తన చెల్లెలి విషయంలో క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని ఆలస్యంగా పరీక్షలు చేయించుకోవడంతో వ్యాధి ముదిరిందని చెప్పారు. అనంతరం బసవతారకం ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడంతో పాటు రేడియేషన్ వంటి వైద్య చికిత్సలు చేయించుకున్నారని వివరించారు. చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాల్సి ఉండగా, మరోసారి పరీక్షలకు వెళ్లినప్పుడు క్యాన్సర్ తిరిగి వచ్చినట్లు తెలిసిందని చెప్పారు. ఈసారి వ్యాధి నాలుగో స్టేజ్ చేరుకుందని బాధ పడిపోయారు .

అంతేకాకుండా క్యాన్సర్ వెన్నుపూస వరకు వ్యాపించడంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారిందని రాజీవ్ తెలిపారు. వెన్నుపూస దగ్గర ఎముకలు బలహీనపడుతూ దెబ్బతినడంతో నడవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారిందని చెప్పారు. తీవ్రమైన నొప్పితో ఆమె ఎంతో బాధపడిందని, నొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందుల ప్రభావం కూడా కొన్ని గంటల వరకే ఉండేదని వివరించారు. ఆ తర్వాత మళ్లీ అదే బాధ మొదలయ్యేదని చెబుతూ చెల్లెలు పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు.

ఇక ఈ విషాదం కరోనా సెకండ్ వేవ్ సమయంలో జరగడం కుటుంబాన్ని మరింత ఇబ్బందులకు గురిచేసిందని రాజీవ్ చెప్పారు. అప్పట్లో ఒకరి ఇంటికి మరొకరు వెళ్లలేని పరిస్థితి. ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని డాక్టర్స్ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారని తెలిపారు. చెల్లెలి చివరి రోజుల్లో ఆమె పక్కనే ఉండటం, ఆమె పరిస్థితిని గమనించడం తనకు జీవితంలో మరిచిపోలేని అనుభవంగా మిగిలిపోయిందని చెప్పారు.

ఆ సమయంలో దాదాపు ఏడు రోజుల పాటు సరిగ్గా నిద్రపోలేదని రాజీవ్ తెలిపారు. రాత్రి వేళల్లో అందరూ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నా, తాను మాత్రం చెల్లెలి గదిలో నుంచి ఏదైనా శబ్దం వినిపిస్తుందేమోనని తలుపు దగ్గర నిలబడి గమనించేవాడినని తెలిపారు. ఆమె మూలుగుతున్న శబ్దం వినిపిస్తుందా లేదా అని చెవులు దగ్గరగా పెట్టి వినేవాడినని చెప్పారు. ఆ ఏడు రోజులు నిద్రలేకుండా గడిపినట్లు గుర్తుచేసుకున్నారు.

ALSO READ :రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

Tags

Related News

అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటున్న హెబ్బా!

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

Big Stories

Advertisement
×