E-Paper
Advertisement

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!
Advertisement

KM Radha Krishnan:కేఎం రాధాకృష్ణన్..ఆనంద్ ,గోదావరి ,చందమామ వంటి అద్భుతమైన సినిమాలకి సంగీతం అందించిన ఈ క్రేజీ మ్యుజీషియన్ ఓక్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా ఒక పాటను మొదట సునీతతో పాడించి, ఆ తర్వాత ఆశా భోంస్లేతో పాడించారని.. అయితే ఆడియో విడుదలయ్యే వరకు ఆశా భోంస్లే కూడా ఆ పాట పాడారనే విషయం సునీతకు తెలియదనే రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి.దీనిపై రాధకృష్ణన్ రియాక్ట్ అవుతూ అందులో కొంత నిజం ఉందని వివరించారు. సునీత చందమామ సినిమాలో రెండు పాటలు పాడారని, కానీ నాలో ఊహలు ,నాలో ఊసులు అనే పాట విషయంలో మాత్రం అలా జరిగిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఆ సమయంలో ఆశా భోంస్లే అమెరికాలో ఉన్నారని, ఆమెను కాంటాక్ట్ అయినప్పుడు తాను యూఎస్‌లో ఉన్నానని,త్వరలో వస్తాను వచ్చాక కాల్ చేయండి అని చెప్పిందని గుర్తుచేసుకున్నారు. అయితే సినిమా పరిశ్రమలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, రేపే సినిమా విడుదలవుతుందన్నంత హడావుడి ఉంటుందని వివరించారు. అందుకే పాటని సునీతతో పాడించామన్నారు.

Advertisement

మాములు సింగర్స్ తో పనిచేసే సమయంలో డబ్బులు ఇచ్చి పాట పాడించుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చని, కానీ ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ లాంటి లెజెండ్స్ తో విషయానికి వస్తే లెక్క వేరేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. వాళ్లను ఎలా అప్రోచ్ అవ్వాలి?ఎలా గౌరవించాలి? చేసిన మ్యూజిక్ కంపోజిషన్ వారికి నచ్చేలా ఎలా వివరించాలి? అనే విషయాలు చాలా ముఖ్యమని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.

అయితే ఆ పాట అప్పటికే పాడిన సునీత కూడా ఆ పాటను అద్భుతంగా పాడిందని ఆకాశానికి ఎత్తేశారు.ముఖ్యంగా సునీతకి ఆ పాట అంటే ఎంతో ఇష్టం ఏర్పడిందని, పాటని కూడా చాలా శ్రద్ధతో పాడారని తెలిపారు. ఈ విషయం దర్శకుడు వంశీతో సహా అందరికీ నచ్చిందని తెలిపారు.అయితే ఒక పాటను మరింత స్పెషల్ గా మార్చాలనే ఆలోచనతో ఆశా భోంస్లేతో కూడా పాడించామని చెప్పారు.చివరగా ఈ విషయాన్ని డైరెక్టర్ కృష్ణ వంశీకి చెబితే పర్సన్స్ కన్నా ప్రేక్షకుల ముందుకు వెళ్ళే సినిమానే ముఖ్యమని,అలా అందరి సూచనల మేరకు ఆశా భోంస్లే పాడిన పాటని ఉంచామని అసలు విషయం చెప్పుకొచ్చారు.

Advertisement

ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో వచ్చిన గ్యాప్ గురించి కూడా రాధాకృష్ణన్ మాట్లాడారు. ‘చందమామ’ సినిమా తర్వాత వరుసగా ఎక్కువ పని చేయడంతో కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతీ అవకాశానికి నో చెప్పానని,దానితో కొందరు తనపైకావాలనే విమర్శలు చేశారని వాపోయారు.ఇక ఎప్పటికీ ఒకేలా మూస పద్దతిలో కాకుండా సరికొత్త ప్రయోగాలు చేయాలని తనకు ఉండేదని చెప్పారు.

ఇక తను చేసిన సినిమాలలో ‘గోదావరి’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, అందులోని సెన్సిబుల్ ఎమోషన్స్ తనకు బాగా నచ్చాయని చెప్పారు. అలాగే ‘యమునా తీరం’ పాట తన మనసుకు చాలా దగ్గరైన పాటని , ప్రముఖ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ అంటే తన ఫేవరేట్ అని మనసులోని మాటల్ని ఇలా బయటపెట్టాడు కేఎం రాధాకృష్ణన్..!

ALSO READ :బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

Tags

Related News

‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!

ప్రకాష్ రాజ్ కు చేజారిపోతున్న సినిమా అవకాశాలు.. రాజకీయాలే కారణమన్న భార్య!

సినీ హిస్టరీలో కొత్త అధ్యాయం.. 70ఎంఎం స్క్రీన్ పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్!

సీఎం విజయ్ ఇంట విషాదం!

Big Stories

Advertisement
×