Ram Charan RC17:మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న sసరికొత్త సినిమాపై ఎలాంటి అంచానాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరికాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూల్లని కొల్లగొట్టడంతో rc17 మీద బజ్ పెరిగిపోయింది.ఈ క్రమంలో ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు రావడంతో మురిసిపోతున్నారు మెగా ఫాన్స్.
రామ్ చరణ్ కెరీర్‌లో 17వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో నవంబర్ 1న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 10.50 గంటలకు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ‘అండ్ వి బిగిన్’ అంటూ మేకర్స్ అఫీషియల్ గా ఎక్స్ లో ప్రకటించడం తో హ్యాపీ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు అభిమానులు.
అయితే ఈ సినిమా ముహుర్తం ముంచుకొస్తున్నా కూడా ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరు ,పని చేసే టెక్నీషియన్స్ ఎవరు వంటి అప్ డేట్స్ పై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ముఖ్యంగా రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్న అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేస్తుంది . గత కొంతకాలంగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే, సారా అర్జున్,సాత్విక వీరవల్లి వంటి వారి పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఇక వీళ్ళపై ఫొటో షూట్ కూడా చేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్ ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ ఇవ్వలేదు.
ALSO READ :గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!
ఇక ఈ సినిమాకు సంగీతం అందించే లక్కీ ఛాన్స్ ఎవరికీ దక్కుతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా.సుకుమార్ సినిమాల్లో మ్యూజిక్ ఎలా మ్యాజిక్ చేస్తుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ‘ఆర్య’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశాయి.అందుకే రామ్ చరణ్‌తో చేయబోయే కొత్త సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తారా? లేక మరో సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తారా? అనే చర్చ జోరుగా నడుస్తుంది.చూడాలి మరి నవంబర్ 1న జరగనున్న పూజా కార్యక్రమంలో అయినా ఈ విషయాలని రివీల్ చేస్తారో లేదో !
And we begin 😎🔥
The most awaited #RC17 Pooja Ceremony ✨
Tomorrow (1st November) at 10.50 AM.#YouCanImagine #RC2Sukku
Mega Power Star @AlwaysRamCharan Master Storyteller @aryasukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl pic.twitter.com/cjj98DcfB1
— Mythri Movie Makers (@MythriOfficial) October 31, 2026