E-Paper
Advertisement

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!
Advertisement

SP Balu:ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balu)..తనదైన గాత్రంతో కోట్లాది మంది ప్రేక్షకులని అలరించిన ఈ గాన గంధర్వుడు కరోనా మహమ్మారితో దూరమైన సంగతి తెల్సిందే.అయితే తాను బెడ్ పై చికిత్స తీసుకునే సమయంలో కూడా తిరిగి ఎప్పుడు పాటలు పాడతాను అనే ఆలోచనతోనే ఉండేవారని, డాక్టర్స్ ని కూడా అదే అడిగే వారని ,పాటలు పాడటం పై తనకున్న కమిట్ మెంట్ అలాంటిది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి వాసు రావు గుర్తుచేసుకున్నారు. బాలు తో తనకున్న అనుబంధాన్ని, ఆయన చివరి రోజుల్లో జరిగిన ఈ విషయాలని వివరిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఇద్దరి మధ్య ఎంతో స్నేహం ఉండేదని వేలాది కచేరీల్లో కలిసి పాల్గొన్న ఈ ఇద్దరూ ఒకరితో ఒకరు ఎంతో ఫ్రెండ్లీ గా ఉండేవాళ్లమని పద్మభూషణ్ వచ్చేవరకు బాలుతో అలాగే ఉన్నానని వాసు రావు తెలిపారు. అయితే తన కొడుకు పెళ్లి తర్వాత నుంచి బాలు గారికి మరింత గౌరవం ఇవ్వాలని అనుకున్నానని చెప్పారు. 2019లో నెల్లూరులో జరిగిన తన కొడుకు పెళ్ళికి బాలు స్వయంగా వచ్చి పెళ్లి పెద్దగా ఉన్నారని పెళ్లి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకోవడమే కాకుండా, కొత్తగా పెళ్లైన కొడుకు, కోడలిని తన ఇంటికి తీసుకురావాలని ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ చెప్పారని బాలుతో తనకున్న అనుబందాన్ని బయటపెట్టారు.. ఈ పెళ్లికి వచ్చినప్పుడే బాలు గారిని చివరిసారిగా కలిశానని ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఇక బాలు గారికి కరోనా ఎలా సోకిందనే విషయంపై మాట్లాడుతూ అప్పట్లో ఆయనకి హైదరాబాద్‌లోని ఓ సింగర్ నుంచి కరోనా అంటిందని రూమర్స్ వినిపించాయని అదంతా రూమర్స్ అని కొట్టి పారేశాడు.
తనకు తెలిసిన సమాచారం ప్రకారం, కరోనా సమయంలో మౌనరాగం బృందం నిర్వహించిన ఓ సంగీత కార్యక్రమానికి బాలు వెళ్ళారని హాజరయ్యారని ఆ కార్యక్రమానికి వెళ్లే సమయంలో ఆయన మాస్క్ ధరించినప్పటికీ, పాటలు పాడాల్సి రావడంతో మాస్క్ తీసేశారని తెలిపారు. బాలు తన సొంత మైక్‌ను తీసుకెళ్లినా, కార్యక్రమంలో ఇతరుల మైక్ వాడాల్సి వచ్చిందని. పాటలు పాడుతున్న సమయంలో అలా ఏమైనా వైరస్ ఏమైనా బాలుని ఎటాక్ చేసి ఉండవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ కార్యక్రమానికి వెళ్లిన మూడు రోజుల తర్వాత బాలు గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని వాసు రావు వివరించారు.

ఇక కరోనా వచ్చిన తర్వాత బాలు తన ఫ్రెండ్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తనకు కొన్ని లక్షణాలే ఉన్నాయని చెప్పారని తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు వైరస్ అంటకూడదనే ఉద్దేశంతో తానే ఆసుపత్రిలో చేరినట్లు కూడా చెప్పారని వాసు రావు చెప్పుకొచ్చారు.అయితే ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా బాలు తనకు అత్యంత ఇష్టమైన సంగీతాన్ని వదల్లేకపోయారట. అక్కడ చికిత్స పొందుతున్న ఇతర కరోనా బాధితులు పాటలు పాడుతుంటే, వారి దగ్గరకు వెళ్లి ఎలా పాడాలో చెప్పేవారని వాసు రావు తెలిపారు.ఒక పాటను ఎవరో తప్పుగా పాడితే వెంటనే సరిచేసి, సరైన రాగం, పద్ధతిని వివరించేవారని, కరోనా బాధితులతో కలిసి కూర్చొని పాటలు పాడేవారని చెప్పారు.

Advertisement

ఆ తర్వాత బాలు ఆరోగ్యం క్రమంగా క్షీణించి వెంటిలేటర్‌పైకి వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆయన వివరించారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రతిరోజూ ఆయన ఆరోగ్యం గురించి అడిగేవారని చెప్పారు. చివరిలో బాలు స్పృహలో ఉన్న సమయంలో డాక్టర్స్ ట్రీట్ మెంట్ కి రెడీ అవుతుంటే తన చేతులు, సైగల ద్వారా ఏదో చెప్పడానికి ప్రయత్నించారని చివరకు ఏసీ రిమోట్‌ను చూపిస్తూ, ఒక రంధ్రం చేసినట్లయితే తాను మైక్ పట్టుకుని పాడగలనా అన్నట్లుగా సైగ చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్నడాక్టర్ కూడా ఎమోషనల్ అయి బయటికి వెళ్లిపోయారని చెప్పారు.ఏది ఏమైనా చావు వస్తుందని తెల్సి కూడా బాలు గారు తన పాటపై ఎంత ప్రేమ చూపించేవారో ఈ ఇన్సిడెంట్ ని బట్టి అర్థమవుతుంది !

ALSO READ :మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

 

Tags

Related News

రామ్ చరణ్ – సుకుమార్ సినిమా.. రేపే అసలు హంగామా!

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!

Big Stories

Advertisement
×