E-Paper
Advertisement

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!

మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!
Advertisement

Rajeev Kanakala:రాజీవ్ కనకాల…ఎన్నో వెరైటీ పాత్రలతో ఆడియన్స్ ని అలరించిన ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా తాను పని చేసిన హీరోలతో,ఎదురైనా అనుభవాలని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తన కోసం గంటల తరబడి ఎదురుచూసిన విషయాన్ని ఇలా ఆసక్తి కరంగా వివరించారు.

రాజీవ్ కనకాల తాను గతంలో హోస్ట్ గా చేసిన ‘అభిమాని’ షో గురించి మాట్లాడుతూ.. ఆ కార్యక్రమం కోసం ఎంతోమంది స్టార్ హీరోలు సమయం ఇచ్చారని చెప్పారు. మాములుగా ఒక్కో హీరోతో 45 నిమిషాల నుంచి గంట వరకు మాత్రమే షూటింగ్ ఉంటుందని ముందుగా చెప్పేవారని, కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేది కాదని వాపోయారు . టెక్నికల్ ఇష్యూస్ తో ఏకంగా గంటలు గంటలు లేట్ అయ్యేదని గుర్తుచేసుకున్నారు.

Advertisement

ఇక మొదటి రోజే నాగ చైతన్య తోనే మొదలెట్టామని ,అయితే టెక్నికల్ ఇష్యూస్ తో షూట్ ఆగిపోతే నాగచైతన్య ఏకంగా 16 గంటల పాటు ఎదురుచూశారని రాజీవ్ గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ ఏ మాత్రం కోప్పడకుండా నెక్స్ట్ డే వచ్చి కోఆపరేట్ చేశారని ,ఇక రెండో రోజు కూడా దాదాపు ఎనిమిది గంటల పాటు షూటింగ్ జరిగిందని చెప్పారు. ఇక ఎన్టీఆర్, ప్రభాస్, కళ్యాణ్ రామ్ కూడా ఈ షో కోసం గంటల పాటు టైం కేటాయించారని, ఎన్టీఆర్ సుమారు ఎనిమిది గంటలు, ప్రభాస్ ఆరు నుంచి ఏడు గంటలు, కళ్యాణ్ రామ్ దాదాపు 10 నుంచి 11 గంటల పాటు తన కోసం సమయం కేటాయించారని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు.

ఇక మంచు మనోజ్ గురించి మాట్లాడుతూ 2002 ఆ ప్రాంతంలో మనోజ్ తనను ఒకసారి కారులో నానక్‌రామ్‌గూడలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడని,అయితే అప్పట్లో అక్కడ పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండేది కాదని, మనోజ్ వేగంగా కారు స్పీడ్ గా నడుపుతూ ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ, టర్న్ చేస్తూ తనని భయపెట్టాడని అప్పటి నుండి మనోజ్ కారులో ఎక్కకూడదని నిర్ణయించుకున్నానని, తనను బలిచ్చే బకరాలా చూశాడంటూ సరదాగా చెప్పుకొచ్చారు రాజీవ్.

Advertisement

తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఇంకా చేయని పాత్రలు చాలానే ఉన్నాయని ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాల్లో పూర్తిస్థాయిలో నటించాలని ఉందని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఇంద్రుడి పాత్రలో కనిపించిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ తనలో ఇంకా బయటకు రాని పాత్రలు ఎన్నో ఉన్నాయని అవన్నీ వేసి ఆడియన్స్ ని మెప్పించాలని ఉందని మనసులోని మాటల్ని బయట పెట్టాడు ఈ వెర్సటైల్ యాక్టర్!

ALSO READ :గాజులు గల గల కంటే ముందే రాధమ్మ కూతురు చేసిన పాట ఇదే!

Tags

Related News

ఎస్పీ బాలు చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? కన్నీళ్లు పెట్టించిన సాలూరి వాసు రావు!

ఒకే పాట.. ఇద్దరు స్టార్ సింగర్స్.. తెరవెనుక ఏం జరిగిందో చెప్పిన సంగీత దర్శకుడు!

‘ఇట్లు అర్జున’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలకు మోక్షం దక్కేనా?

ఆ హీరోతో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉందన్న పూజా హెగ్డే..ఆ కోరిక తీరేనా?

రామ్ చరణ్ హీరోయిన్‌గా అచ్చ తెలుగు అమ్మాయి.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్?

‘ఐఫా అవార్డ్స్ 2026’లో సత్తాచాటిన ధురంధర్.. ఏకంగా 12 అవార్డ్స్!

ప్రకాష్ రాజ్ కు చేజారిపోతున్న సినిమా అవకాశాలు.. రాజకీయాలే కారణమన్న భార్య!

Big Stories

Advertisement
×