Producers Darna:తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్(TFCC) లో అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో ఐదు మంది నిర్మాతలు ఫిలిం ఛాంబర్ కి రాజీనామా చేసి.. ధర్నా చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఇలా ధర్నాలు ఏంటి? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గత ఏడాది 2024 జూలైలో జరిగిన TFCC ఎన్నికలలో దిల్ రాజు (Dilraju) పదవి కాలం పూర్తవడంతో భరత్ భూషణ్ (Bharath bhushan) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా అశోక్ (Ashok) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో యజమానులు, నిర్మాతలు ఇలా మొత్తం నాలుగు సెక్టార్స్ లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించి.. భరత్ భూషణ్ ను టీఎఫ్సీసీ అధ్యక్షుడిగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ నెలాఖరులో అధ్యక్షుడిగా భరత్ భూషణ్ పదవీకాలం ముగియనుండడంతో.. వచ్చే నెల అనగా ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో..TFCC రూల్స్ బ్రేక్ చేసి మరీ.. తన పదవీ కాలాన్ని పొడిగించాలని అటు భరత్ భూషణ్ తో పాటు ఇటు కోశాధికారి అశోక్ ప్రసన్న కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు.
పదవీకాలం పొడిగించడానికి భరత్ భూషణ్ భారీ ప్రయత్నం..
దీంతో ఈసీ సమావేశం నిర్వహించి.. రూల్స్ బ్రేక్ చేయడం కుదరదు అంటూ స్పష్టం చేసింది. అంతేకాదు భరత్ భూషణ్, అశోక్ ప్రసన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయంతో.. తమ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలని చూస్తున్నారని తెలిసి.. ఈ పొడిగింపు రెండు మూడు నెలల వరకు ఓకే అని స్రవంతి రవి కిషోర్ (Sravanthi Ravi kishore) చెప్పినా.. వీరు వినడం లేదు. దీంతో స్రవంతి రవి కిషోర్ తో పాటు కొల్లా అశోక్ కుమార్ ఈ పొడిగింపును వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
పదవీకాలం పొడిగింపు పై సభలో తిరుగుబాటు..
అయితే ఈ విషయంపై భరత్ భూషణ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దగ్గరగా ఉండడం.. సంబంధాలు, నియామకాలు, తమ పనిని నిర్ధారిస్తాయని చెప్పడమే కాకుండా తమకు పొడిగింపు అవసరమని భీష్నించుకు కూర్చున్నారు. దీంతో ఈ పొడిగింపు పై సభలో తిరుగుబాటు జరుగుతోంది.
రాజీనామా చేసిన ఐదుగురు నిర్మాతలు..
అందులో భాగంగానే ఆక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) ఛాంబర్ కు ఎన్నికైన ఐదుగురు సభ్యులు దిల్ రాజు (Dilraju ), మైత్రి రవి (Mytri Ravi) , స్రవంతి రవి కిషోర్(Sravanthi Ravi kishore), సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda), ఠాగూర్ మధు(Thagur madhu) నిన్న జూమ్ మీటింగ్ నిర్వహించి మరీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ నెలాఖరిలోపు వారి పదవీకాలం ముగిస్తుంది కాబట్టి ఆ లోపే రాజీనామా చేసారు.
పొడిగింపును వ్యతిరేకిస్తూ ధర్నా ఆరంభం..
ఇప్పుడు పొడిగింపును తిరస్కరిస్తూ..వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. ధర్నా కూడా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి తోడు ఛాంబర్ నుండి ఆరుగురు మాజీ అధ్యక్షులు కూడా బైలాస్ కి వ్యతిరేకంగా.. గడువును పొడిగించకుండా ప్రణాళిక ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాశారు.
టీఎఫ్సీసీకి ఎన్నికలు జరపాలని మాజీ అధ్యక్షులు లేఖ..
అలా తక్షణ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ లేఖలు రాసిన వారిలో మాజీ అధ్యక్షులు కేఎస్ రామారావు, జెమినీ కిరణ్, ఎన్ సుధాకర్ రెడ్డి , బసిరెడ్డి , వీర నాయుడు, ఎన్ వి ప్రసాద్ ఉన్నారు. పైగా ఎన్నికలు ప్రణాళిక ప్రకారం జరగకపోతే కోర్టుకు వెళ్లాలని కూడా కొంతమంది సభ్యులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా.. ఐదుగురు యాక్టివ్ మెంబర్స్ తో పాటు ఈ మాజీ అధ్యక్షులు కూడా ఫిలిం ఛాంబర్ ముందు సోమవారం నుండి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
భరత్ భూషణ్ పొడిగింపు నిర్ణయం వెనుక అసలు స్వార్థం ఇదే..
ఇకపోతే భరత్ భూషణ్ మరో సంవత్సర కాలం పాటు తన పదవిని పొడిగించాలని కోరడం వెనుక అసలు స్వార్థం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిత్రపురి లో ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కారణంగానే పొడిగింపు కోసం ప్రయత్నిస్తున్నారని పుకార్లు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఖరీదైన ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు అధికారంలో ఉండడం అత్యంత కీలకం. అందుకే భరత్ భూషణ్ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ:Rashmika Mandanna: లవ్ పై తొలిసారి స్పందించిన రష్మిక.. ఆ మార్పు ఆనందాన్నిస్తుంది అంటూ!