అమెరికాలో వింత సమస్య వచ్చి పడింది. దాన్ని పరిష్కరించడానికి అమెరికా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు ప్రారంభించారు. ఒక సైన్స్ హారర్ సినిమాను తలపిస్తూ.. క్రూరమైన పరాన్నజీవి ఈగలు (screwworms) మూగజీవాలపై విరుచుకుపడుతున్నాయి. వీటని ఎదుర్కోవడానికి అమెరికా అధికారులు వింత ప్రయోగం చేస్తున్నారు. లక్షలాది స్టెరిలైజ్డ్ (పునరుత్పత్తి చేయలేని) ఈగలను విమానాల నుండి వదలబోతున్నారు.
ఈ పరాన్నజీవి ఈగలు సెంట్రల్ అమెరికా నుండి ఉత్తరం వైపు వస్తూ.. ఇప్పుడు దక్షిణ మెక్సికో వరకు వ్యాపించాయి. ఈ ఈగలు అమెరికా భూభాగంలోకి ప్రవేశించడంతో పశువుల పెంపకందారులు, రైతులు, వ్యవసాయ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మాంసాహార ఈగలను ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది.
ఈ ఈగలను అడ్డుకోవడానికి అమెరికా వ్యవసాయ శాఖ (USDA) టెక్సాస్-మెక్సికో సరిహద్దు దగ్గర ఒక కొత్త “ఈగల ఫ్యాక్టరీ” నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఫ్యాక్టరీలో స్టెరిలైజ్డ్ మగ ఈగలను పెద్ద సంఖ్యలో పెంచి, వాటిని విడుదల చేస్తారు. ఈ మగ ఈగలు.. క్రూరమైన ఆడ ఈగలతో జతకడతాయి, కానీ వారికి సంతానం ఉత్పత్తి కాదు. దీనివల్ల ఈగల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ విధానం గతంలో కూడా అమెరికాలో విజయవంతంగా పనిచేసింది.
మాంసం తినే ఈగలు
న్యూ వరల్డ్ స్క్రూవర్మ్ అనే ఈ మాంసాహార ఈగలు చాలా ప్రమాదకరమైనవి. సాధారణ ఈగలు చనిపోయిన పదార్థాలను తింటాయి, కానీ ఈ ఈగల లార్వాలు బతికున్న జంతువుల మాంసాన్ని తింటాయి. “జంతువు గాయంపై ఆడ ఈగ దిగి.. ఆ గాయం ఉన్న 200-300 గుడ్లు పెడుతుంది,” అని టెక్సాస్ A&M యూనివర్సిటీలో ఎంటమాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఫిలిప్ కౌఫ్‌మన్ చెప్పారు. ఈ గుడ్లు పొదిగిన తర్వాత, లార్వాలు జంతువు మాంసంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఇవి తీవ్రమైన గాయాలు, ఇన్ఫెక్షన్లు కలిగించి, చికిత్స చేయకపోతే మరణానికి కూడా దారితీస్తాయి. పశువులు ఈ ఈగలకు ప్రధాన లక్ష్యం అయినప్పటికీ, వన్యప్రాణులు, పెంపుడు జంతువులు, మనుషులు కూడా ఈ ఈగల బాధితులు కావచ్చు. 2023 నుండి సెంట్రల్ అమెరికాలో 35,000 కంటే ఎక్కువ స్క్రూవర్మ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
ఆడ ఈగలను ఎదుర్కోవడానికి ఈగలను
ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ (SIT) అనే పద్ధతిని ఉపయోగిస్తోంది. ఈ పద్ధతిలో మగ ఈగల ప్యూపాలను గామా రేడియేషన్‌కు గురిచేసి, వాటిని స్టెరిలైజ్ చేస్తారు. ఈ ఈగలు ఆడ ఈగలతో జతకట్టగలవు, కానీ సంతానం ఉత్పత్తి చేయలేవు. “ఆడ ఈగలు తమ జీవితంలో ఒక్కసారి మాత్రమే జతకడతాయి, కాబట్టి ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది,” అని కౌఫ్‌మన్ చెప్పారు. ఈ స్టెరిలైజ్డ్ ఈగలను లక్షల సంఖ్యలో విమానాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో విడుదల చేస్తారు.
ప్రస్తుతం.. పనామాలో ఒకే ఒక ఫ్యాక్టరీ ఈ స్టెరిలైజ్డ్ ఈగలను ఉత్పత్తి చేస్తోంది. కానీ ఈగలు అమెరికా సరిహద్దుకు దగ్గరవుతున్నందున, మరో ఫ్యాక్టరీ అవసరం. అందుకే టెక్సాస్‌లోని హిడాల్గో కౌంటీలో మూర్ ఎయిర్ బేస్‌లో కొత్త ఫ్యాక్టరీ నిర్మించాలని USDA ప్లాన్ చేస్తోంది.
Also Read: ₹1712 కోట్ల భారీ వేతనం.. ఆపిల్ టాప్ ఇంజినీర్‌కు మెటా బంపర్ ఆఫర్
ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు 300 మిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా. అలాగే, మెక్సికోలోని ఒక పాత ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్ చేయడానికి 21 మిలియన్ డాలర్లు కేటాయించారు.ఈ ఈగలు వెసవి కాలంలో ఎక్కువగా సంక్రమిస్తాయి. అందుకే.. పశువులకు గుర్తులు వేయడం, ట్యాగ్‌లు వేయడం లేదా కాస్ట్రేషన్ చేయడం వంటివి ఈ సమయంలో చేయవద్దని పెంపకందారులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఈగలకు వ్యాక్సిన్ లేదా నిరూపితైమన రిపెల్లెంట్ లేదు, కాబట్టి నివారణే లక్ష్యంగా ఈ ప్రయోగం చేస్తున్నారు.