Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ‘గీతాగోవిందం’ సమయం నుండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లడం.. కలిసి కనిపించడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. దీనికి తోడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్ లో కూడా రష్మిక హాజరవుతోంది. అంతేకాదు అప్పుడప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు వెళ్లడం, షికారులకు వెళ్లడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. దీంతో అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకు తమ ప్రేమ విషయంపై ఈ జంట ఓపెన్ అవ్వలేదు. కానీ తొలిసారి రష్మిక మందన్న ప్రేమ గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆ మార్పు సంతోషాన్ని ఇస్తుంది – రష్మిక
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ప్రేమ అనే పదం పై స్పందించింది. “ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మారాలి. ఆ మార్పు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మనసుకు నచ్చిన వారి కోసం మారడంలో తప్పులేదు” అంటూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా.. దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “మరి విజయ్ తో ప్రేమలో ఉన్నావు కదా.. నీలో ఎలాంటి మార్పు వచ్చింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి.
రష్మిక సినీ కెరియర్..
‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా టైర్ -2 హీరోలతో మొదలుపెట్టిన ఆమె సినీ కెరియర్ ఇప్పుడు స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) తో పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. పుష్ప 2 సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంది. తన మాస్ పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
తొలిసారి అలాంటి పాత్రలో రష్మిక..
ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ సన్నివేశాలలో నటించడమే కాకుండా ఛావా వంటి హిస్టారికల్ సినిమాలలో రాజసం ఉట్టిపడేలా మహారాణి పాత్రలో కూడా నటించి నిరూపించింది. ఇక ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ గా కూడా నటించడానికి సిద్ధమైన ఈమె.. అటు మళ్లీ అల్లు అర్జున్ సినిమాలో తొలిసారి విలన్ పాత్ర పోషించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఐదు మంది హీరోయిన్లను ఎంపిక చేసుకోగా.. అందులో రష్మిక కూడా ఒకరు. అయితే రష్మిక ఈసారి హీరోయిన్గా కాకుండా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతోందని.. ఈ పాత్రతో మరో రమ్యకృష్ణ గా రికార్డు సృష్టించబోతుందని సమాచారం.
also read:Prakash Raj: పవన్ కళ్యాణ్ పై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్.. ఛీ..ఛీ..దిగజారిపోతున్నారంటూ!