Rachitha Ram: మేడిపండు చూడు మేలిమై యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్పినట్లు. కొంతమందిని చూడగానే చాలా అమాయకులు లా అనిపిస్తారు. కానీ వాళ్లు చేసే పనులు చూస్తుంటే మామూలు షాకింగ్ ఉండదు. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే, చూడ్డానికి ఇంత అమాయకంగా కనిపిస్తున్నారు వీళ్ళు ఈ పని చేశారా అని అనిపిస్తుంది.
ఇక సినిమాలలో కూడా అలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు సర్ప్రైజ్ ఇస్తాయి. ఖైదీ (Khaidhi) సినిమాలో నెపోలియన్ పాత్రను ఎవరు ఊహించరు చూడ్డానికి పొట్టిగా ఉన్నా కూడా తుపాకీ పట్టుకొని అందరినీ షేక్ ఆడిస్తాడు. ఇక రీసెంట్ గా వచ్చిన కూలీ (Coolie) సినిమాలో అలాంటి సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశాడు లోకేష్ కనకరాజ్.
అమాయకంగా ఉంటూ అల్లాడించింది
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా టికెట్లు దొరకట్లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమాలో కళ్యాణి అనే పాత్రలో కనిపించింది రచితా రామ్. 2013లో దర్శన్ తో (Darshan) నటించిన సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రచిత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. కూలీ సినిమాలో మాత్రం తాను చేసిన పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఏకంగా రజనీకాంత్, నాగార్జున (Nagarjuna) లాంటి ఘనులను తన పర్ఫామెన్స్ తో డామినేట్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్
రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమాలో పాత్ర బాగుంది అంటే, ఆ పాత్ర చేసిన వాళ్ళని చాలా ఈజీగా గుర్తించడం మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈమె అకౌంట్ కోసం చాలామంది సెర్చ్ చేశారు. మొత్తానికి ఆ అకౌంట్ పట్టుకొని ఇప్పుడు మహానటి అంటూ చాలామంది ఎలివేషన్ ఇస్తున్నారు. మొత్తానికి కళ్యాణి అనే పాత్ర రచితా రామ్ కి విపరీతమైన పేరు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా చూసిన తర్వాత ఈమెకి అవకాశాలు కూడా విపరీతంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంక తెలుగు దర్శకులు కూడా ఏమన్నా సినిమాలలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ఒక సినిమా హిట్ అయితే ఆ పాత్రకు మంచి పేరు వస్తే అవకాశాలు పరిగెత్తుకుంటూ వస్తాయి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: Prabhas: క్రిస్టియన్ అమ్మాయితో లవ్ లో పడ్డ ప్రభాస్, ఇదెక్కడి ట్విస్ట్ సామి