Prabhas: ప్రభాస్ క్రేజ్ కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం మారిపోయింది. ఎప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇండియాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని చాలా కథనాలు ప్రశ్నిస్తుంటాయి. అతని పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉన్న సినిమా చేస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు సీరియస్ టైప్ లోనే ఉంటాయి. స్వతహాగా మారుతి బలం కామెడీ కాబట్టి ప్రభాస్ తో ఇప్పుడు అదే జోనర్ లో చేస్తున్నాడు.
క్రిస్టియన్ అమ్మాయితో లవ్
ప్రభాస్ ఏంటి క్రిస్టియన్ అమ్మాయిని లవ్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా.? అవును క్రిస్టియన్ అమ్మాయితో ప్రేమలో పడబోతున్నాడు ప్రభాస్. ఇంతకు అసలు విషయం ఏంటంటే రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో నిధి ఒక క్రిస్టియన్ అమ్మాయి ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉంది. క్యాండిల్స్ ముందు ప్రేయర్ చేస్తూ క్యూట్ గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఈమెతో లవ్ లో పడి ఉండొచ్చు అనేది నేటిజన్లో ఆలోచన. అందుకే క్రిస్టియన్ అమ్మాయితో ప్రభాస్ లవ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Team #TheRajaSaab celebrates the gorgeous and talented @AgerwalNidhhi on her special day ❤️🔥❤️🔥
Her role is set to bring grace, warmth and depth to this KING SIZE tale 💥💥#HBDNidhhiAgerwal#Prabhas @DuttSanjay @DirectorMaruthi @MalavikaM_ #RiddhiKumar @Bomanirani… pic.twitter.com/seO6ULAR7M
— People Media Factory (@peoplemediafcy) August 17, 2025
నో రిలీజ్ డేట్ క్లారిటీ
ప్రభాస్ అభిమానులకు డిసెంబర్ 5న మంచి పండగ వాతావరణం నెలకొంటుంది అని అందరూ ఫిక్స్ అయిన తరుణంలో, ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసి ప్లానింగ్ లో ఉన్నారు నిర్మాత విశ్వప్రసాద్. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. సినిమా కార్మికుల ఇష్యూ వలన హైదరాబాదులో అసలు షూటింగులు జరగడం లేదు. ఇలా షూటింగ్లో ఆగిపోవడం వలన రిలీజ్ డేట్స్ లో ఇబ్బంది వస్తుంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ జనవరి 9 అని అనుకుంటున్నారు. దీని గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: Anil Sunkara: 1 – నేనొక్కడినే… దూకుడు రికార్డులన్నీ కొడదాం అని ప్లాన్ చేశాం