Radhika Apte:సినీ ఇండస్ట్రీలో పని గంటల వ్యవహారం ఏ రేంజ్ లో వివాదం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈ విషయంపై ఎంతోమంది హీరోయిన్లు తమ నోరు విప్పినా.. దీపికా లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడడంతో.. ఈ విషయం కాస్త మరింత వైరల్ అవుతోంది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకొనేను హీరోయిన్గా ఎంచుకున్నారు. కానీ ఆమె అప్పుడే ఒక బిడ్డకు జన్మనివ్వడంతో పాపకి ఆలనా పాలనా చూసుకోవడానికి ఎనిమిది గంటల పని దినాలను కోరింది. దీంతో ఈ వివాదం కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
అయితే అదే సమయంలో చాలామంది సెలబ్రిటీలు దీపికాకు అండగా నిలిచారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా 8 గంటలు కాదు 12 గంటలు అంటూ పని దినాలపై ఊహించని కామెంట్లు చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ చిన్నది..ఇటీవల తల్లి అయిన తర్వాత తన కెరియర్ లో, వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చింది.
అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “వారం రోజులపాటు నా కూతుర్ని చూడకుండా ఉండడం నావల్ల కాదు. అందుకే సినిమా షూటింగ్ గంటలను మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో ఎన్నో వాదనలు, గొడవలను కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక నటిగా నా హక్కుల కోసం ఎంతగా పోరాడాలో తెలిసి నేను ఆశ్చర్యపోయాను. అలాంటప్పుడు చాలామంది అమ్మమ్మ, నానమ్మలను సెట్ కి తీసుకురమ్మని సలహా ఇచ్చారు. అయితే నాకు మాత్రం ఆ విషయాలు నచ్చవు. పైగా ఇది సరైన పరిష్కారం కూడా కాదు మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే నా మొదటి లక్ష్యం.
also read:Director Teja: సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కిన డైరెక్టర్ కొడుకు.. నష్టం ఏ రేంజ్ లో అంటే?
ఇక రోజుకు గరిష్టంగా 12 గంటల షిఫ్ట్ మాత్రమే ఉండాలని, అందులో మేకప్, ప్రయాణం , హెయిర్, షూటింగ్ సమయం అంతా కలిసి ఉండాలని నేను భావిస్తున్నాను . ఒకవేళ ప్రయాణానికి రెండు గంటలు పడితే దానిని కూడా పనిగంటలుగానే పరిగణించాలి అని దర్శక నిర్మాతలను కోరాను ” అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.. ఇకపోతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తానని, వారంలో ఒక సెలవు కావాలని, పైగా చిన్న సినిమాల విషయంలో మాత్రమే కొన్ని మినహాయింపులు ఇస్తానని కూడా చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వృత్తిపరమైన బాధ్యతతో పాటు బిడ్డతో గడిపే సమయానికి కూడా ఎక్కడ రాజీ పడనని రాధిక ఆప్టే చెప్పడంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ విషయాలు విన్న నెటిజన్స్ కరెక్టే కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది..అందుకే పని గంటలపై ఇలా కామెంట్లు చేస్తున్నారు అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు