E-Paper
Advertisement

Telangana Rising Global Summit 2025: ‘సెషన్‌ ఆఫ్‌ సినిమా రైజింగ్‌’లో సినీ సెలబ్రిటీల కామెంట్స్!

Telangana Rising Global Summit 2025: ‘సెషన్‌ ఆఫ్‌ సినిమా రైజింగ్‌’లో సినీ సెలబ్రిటీల కామెంట్స్!
Advertisement

Telangana Rising Global Summit 2025: ‘తెలంగాణ రైజింగ్‘ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమ్మిట్‌ ఘనంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార సంస్థ ప్రతినిథులు, సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

రెండు రోజుల సమ్మిట్

Advertisement

రెండు రోజులు (సోమవారం, మంగళవారం) జరిగిన ఈ సమ్మిట్‌ లో రెండు రోజు సమ్మిట్‌లో నిన్న జరిగిన కార్యక్రమంలో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా దేశంలో పెట్టుబడులు, వ్యాపార సంస్థలపై సమావేశం నిర్వహించారు. ఇక రెండో రోజు సమ్మిట్‌ లో భాగంగా సెషన్‌ ఆఫ్‌ సినిమా రైజింగ్ పేరుతో సమావేశం నిర్వహించారు. దీనికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్యానెల్ స్పీకర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వ్యవహరించగా.. దిల్ రాజు,అర్జున్ కపూర్, అమ‌ల, దామోదర్ ప్రసాద్, బలగం వేణు, సుప్రియ, రాహుల్‌ రవింద్రన్‌ వంటి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇండస్ట్రీ కోసం 65 ఎకరాలు

ఈ సమ్మిట్‌ లో సురేష్‌ బాబు మాట్లాడుతూ.. “25 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీ అంతా మద్రాస్ (ప్రస్తుతం చైన్నై) లోనే ఉండేది. అక్కడి నుంచి ఉమ్మడి ఏపీకి వచ్చాక ,రెండు నెలల్లో హైదరాబాద్ లోనే అన్నీ సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ బాగుకోసం 65 ఎకరాలు కూడా కేటాయించింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి మొదలైంది. అయితే అప్పుడే చెన్నై, హైదరాబాద్‌ వర్కర్స్‌ మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయి. చెన్నై వర్కర్స్‌ అంతా హైదరాబాద్‌ రామని మొండేకేశారు. దీంతో ఇక్కడ స్వయంగా అన్ని అవసరాలు సమకూర్చకోవాల్సి వచ్చింది. అప్పుడే పద్మాలయ, అన్నపూర్ణ స్టూడియోల నిర్మాణం మొదలైంది” అని సురేష్‌ బాబు అప్పటి పరిస్థితులను గుర్తు చేశారు.

ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిస్తే అద్భుతాలు..

Advertisement

ఈ సందర్భంగా యాక్టర్ అండ్ డైరెక్టర్ రాహుల్‌ రవీంద్ర మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మి పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సయిటెడ్ గా ఉందని,  సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు సమ్మిట్స్‌ అవసరమన్నారు. అలాగే పానెల్‌ చర్చల ద్వారా తాను మరింత నేర్చుకునే అవకాశం ఉందని, సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిస్తే ఎన్నో అద్భుతాలు, విజయాలు సాధించోచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: SKN-Sandeep Raj: నువ్వోక నేషనల్‌ అవార్డు గ్రహితవి .. డైరెక్టర్‌కి నిర్మాత ఎస్కేన్‌ మోటివేషన్‌!

ఈ సమ్మిట్ ద్వారా చాలా నేర్చుకున్నా

అదే విధంగా బాలీవుడ్‌ నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనటం సంతోషం గా ఉందన్నారు. విద్యార్తిగా సమ్మిట్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటానని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పనిచేయాలన్నారు. కొత్త ఫిల్మ్ సిటీ రావడం సినిమా పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని, సినిమా పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు వస్తున్నారని పేర్కొన్నారు.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×