E-Paper
Advertisement

CM Revanth: సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఓఆర్ఆర్‌పై పేలిన వాహనం టైర్

CM Revanth: సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఓఆర్ఆర్‌పై పేలిన వాహనం టైర్
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి.. చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనతో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్‌లోని వాహనాల భద్రతపై అధికారులు ఫోకస్ పెట్టారు.

ALSO READ: KAVITHA: బీఆర్ఎస్‌పై కవిత సంచలన విమర్శలు.. అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు, విజయ్ దివస్‌లు అంటూ..?

Related News

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×