OG Film : పవన్ కళ్యాణ్ ఖచ్చితమైన కంటెంట్ బేస్ స్ట్రైట్ సినిమా చేస్తే…. ఆ సినిమా రిలీజ్ అప్పుడు పండగ వాతావరణం ఎలా ఉంటుందో, ఇప్పుడు చాలామందికి మరోసారి అర్థమయింది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అంతటి హైప్ మళ్లీ రాలేదు. ఇక ఓజి సినిమా రేపు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాదులో పలుచోట్ల ఈరోజు 10 గంటలకి ఓజి సినిమా మొదలుకానుంది. సినిమా టిక్కెట్ దాదాపు వెయ్యి రూపాయలకు పైగా ఉన్నా కూడా అభిమానులు వెనకాడకుండా కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈరోజు అసలైన పండుగ అని చెప్పాలి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. సినిమాలు నిర్మించే ఈ సంస్థ మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విమల్ థియేటర్ ను నిర్మించింది. ఈరోజు పడబోయే 10 గంటల షోకి ప్రశాంత్ నీల్, ఎస్ ఎస్ రాజమౌళి, అఖిరా నందన్, మారుతి, ఎస్ కే ఎన్, కిరణ్ అబ్బవరం వీళ్లంతా కూడా అదే థియేటర్లో సినిమా చూడమన్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు నేడు రాత్రి విమల్ థియేటర్లో ఓజి సినిమా చూడమన్నారు.
ఓజి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ సినిమా మీద మంచి క్యూరియాసిటీ ఉంది. ఒక రీమేక్ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిన సుజిత్ తన దగ్గర ఉన్న స్ట్రైట్ కథను చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి ఈ కథ చెప్పిన వెంటనే విపరీతంగా నచ్చేసింది.
ఈ ప్రాజెక్టు ఓకే అవ్వడానికి మెయిన్ రీజన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సాహో (Saaho) సినిమా డైరెక్టర్ సినిమా చాలా బాగా తీశాడు. ఆ డైరెక్టర్ తో మీరు సినిమా చేస్తే బాగుంటుంది. అని పవన్ కళ్యాణ్ కి చెప్పారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి సుజిత్ మంచి అభిమాని. గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు పవర్ స్టార్ అని అరుచుకుంటూ వెళ్లిన వీడియోలు గతంలో కూడా వైరల్ అయ్యాయి. అలానే జానీ సినిమా అప్పుడు హెడ్ బ్యాండేజ్ కట్టుకున్న జ్ఞాపకాలు కూడా పలు ఇంటర్వ్యూస్ లో రివిల్ చేశాడు సుజిత్. ఓజి సినిమా ట్రైలర్ కూడా సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచింది.