Spirulina Powder for Hair: జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అమ్మాయిలు ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడే వారు కూడా ఎక్కువగానే ఉంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని సార్లు బయట దొరికే రసాయన పదార్థాలతో తయారు చేసిన ప్రొడక్ట్ప్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది.
జుట్టు ఒత్తుగా పెరగడంలో ఉపయోగపడే వాటిలో స్పైరులినా ముందు వరుసలో ఉంటుంది. ఇది ఒక రకమైన ఆల్గే (నీలి ఆకుపచ్చ శైవలం). ప్రకృతి సిద్ధమైన, పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన పదార్థం స్పైరులినా . జుట్టు పెరుగుదలకు స్పైరులినా ఎలా ఉపయోగపడుతుందో.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైరులినా అంటే ఏమిటి ?
స్పైరులినా అనేది మంచినీటిలో.. ఉప్పునీటిలో పెరిగే ఒక రకమైన శైవలం. దీనిలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి మాత్రమే కాకుండా.. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
జుట్టుకు స్పైరులినా ప్రయోజనాలు:
1. అధిక ప్రొటీన్ :
జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారవుతుంది. స్పైరులినాలో 60-70% వరకు ప్రొటీన్ ఉంటుంది. ఈ ప్రొటీన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన.. బలంగా ఉండే జుట్టు పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
2. ఐరన్ పుష్కలం:
శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. స్పైరులినాలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్ అందేలా చేసి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
3. విటమిన్లు, మినరల్స్:
స్పైరులినాలో విటమిన్-బి, విటమిన్-ఇ, జింక్ , కాపర్ వంటివి ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా వీటిలో ఉండే విటమిన్-ఇ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే.. జింక్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
4. యాంటీఆక్సిడెంట్లు:
స్పైరులినాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన జుట్టు కుదుళ్లకు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఈ నష్టం జుట్టు తెల్లబడటానికి, జుట్టు రాలడానికి కారణమవుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను కాపాడి.. జుట్టు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.
5. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం:
స్పైరులినాలోని పోషకాలు.. ముఖ్యంగా విటమిన్ ఎ, బి, సి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు సహాయ పడతాయి. ఇది జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరిచి.. కొత్త జుట్టు పెరగడానికి దోహద పడుతుంది.
Also Read: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !
స్పైరులినా పౌడర్‌ను ఎలా ఉపయోగించాలి ?
స్పైరులినా పౌడర్‌ను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు.
2. హెయిర్ ప్యాక్‌గా:
స్పైరులినా పౌడర్‌ను ఒక గిన్నెలో తీసుకుని.. దానికి కొద్దిగా నీళ్లు లేదా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టు కుదుళ్లకు అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచిన తరువాత శుభ్రంగా కడగాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
స్పైరులినా పౌడర్ జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. జుట్టు ఆరోగ్యంగా, బలంగా, నల్లగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే, దీనిని ఉపయోగించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.