BigTV English

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

APSRTC: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ బిగ్ గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ పాసైన వారికి ఇది బంగారు లాంటి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, విద్యార్హత, దరఖాస్తు విధానం, అప్లికేషణ్ ఫీజు, జిల్లాల వారీగా వెకెన్సీ వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)లో 281 అప్రెంటిస్‌ ఖాళీలను నింపేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న అప్రెంటిషిప్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 4 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా కాకుటూరు నెల్లూరు ఆర్‌టీసీ జోన్‌ల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఐటీఐలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 281


జిల్లాల వారీగా వెకెన్సీ వివరాలు..

చిత్తూరు : 48 పోస్టులు

తిరుపతి: 88 పోస్టులు

నెల్లూరు: 91 పోస్టులు

ప్రకాశం: 54 పోస్టులు

వివిధ ట్రేడుల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్) ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. (దరఖాస్తు అనంతరం ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్‌ నుంచి రెజ్యూమ్ ను డౌన్‌లోడ్‌ చేసి వివరాలు నమోదు చేసి నోటిఫికేషన్‌ లో చూపించిన సర్టిఫికెట్లను జత అడ్రస్ కు పంపించాలి.)

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది.

అడ్రస్: ప్రిన్సిపల్‌, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజి, కాకుటూర్‌, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 4

సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను పంపడానికి చివరి తేది: 2025 అక్టోబర్ 6

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 281

అర్హత: ఐటీఐ పాసై ఉంటే చాలు..

ALSO READ: Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Tags

Related News

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

BANK OF MAHARASHTRA: డిగ్రీ, బీటెక్ అర్హతలతో భారీగా కొలువులు.. ఈ జాబ్ వస్తే రూ.1,40,500 జీతం, డోంట్ మిస్

DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!

EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా

AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు

Big Stories

×