Telangana Rains: తెలంగాణలో మళ్లీ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత పది, పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల వానలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతోంది. వర్షాలు భాగ్యనగర వాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీజన్‌లో ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పది నిమిషాల సేపు వర్షం కురిసినా రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లతో జనాలు నరకం చూస్తున్నార. అయితే ఈ రోజు రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాత్రికి ఈ జిల్లాల్లో దంచుడే..
రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రేపు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
మరి కాసేపట్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి జిల్లాల్లో మరి కాసేటప్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించారు. హైదరాబాద్ లో గంట సేపట్లో తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: SSC Constable: ఇంటర్ క్వాలిఫికేషన్‌తో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఇంట్లోనే ఉంటే బెటర్..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.