E-Paper
Advertisement

మ‌నువ‌డి కోసం త‌ల్ల‌డిల్లి.. ఫామ్‌హౌజ్ వీడి..! జ‌ర మాకోసం కూడా రారాదే అప్పుడ‌ప్పుడు..!

మ‌నువ‌డి కోసం త‌ల్ల‌డిల్లి.. ఫామ్‌హౌజ్ వీడి..! జ‌ర మాకోసం కూడా రారాదే అప్పుడ‌ప్పుడు..!
Advertisement

ఆయ‌న పిలిస్తే రాడు..! కాలు బ‌య‌ట‌పెట్టాడంటే దానికో మీనింగుండాలి..! ఫామ్‌హౌజ్ వదిలి బ‌య‌ట‌కు వ‌స్తున్నాడంటే.. బ‌ల‌మైన కార‌ణమేదో ఉండాలె! కారెక్కాడంటే రాజ‌కీయాల్లో క‌ద‌లిక రావాలె. నేత‌లు క‌ద‌లిపోవాలె! గుండెలు అదిరిపోవాలె! అయితే అది టోట‌ల్ త‌న ప‌ర్స‌న‌ల్ అయినా అయి వుండాలె. లేదంటే అది పార్టీకి బ‌ల‌మైన మేలైనా చేసేదై ఉండాలె!

మస్తు చెప్పిన‌వ్ గానీ, ఇప్పుడు ఆయ‌న మ‌న‌వ‌డి కోసం వ‌స్తుండు.. అంతే క‌దా! వ‌స్తే రానీ ఆయ‌న మ‌న‌వ‌డు ఆయ‌నిష్టం. నేన‌దే చెబుతున్నా. ఆయ‌న‌కు మ‌న‌వ‌డంటే పంచ ప్రాణాలు. అంత‌కు మించి. అంత‌కు మించి..? అంటే. అంటే… త‌న కొడుకు రాము క‌న్నా మించి. అవునా? అవును మ‌రి భ‌ద్రాద్రి రాముడి పెండ్లికి ప‌ట్టు వ‌స్త్రాలు పంపేంత ఇష్టం. బిడ్డె క‌వితన్నా, క‌విత కొడుకుల‌న్నా ఆయ‌నకు ప‌ట్టింపులేదు. కొడుకు.. కొడుకంటే ఎవరికైనా ఎంత ఇష్ట‌మో తెల్వ‌దా? అయితే కేసీఆర్ కూడా సేమ్ అంతేనా?

Advertisement

ఆయనేమ‌న్నా మీదునుంచి ఊడిప‌డ్డడ‌. ఇంకా చాలా మంది లెక్క‌నే ఆయ‌న‌కు కొడుకు.. కొడుకు కొడుకు.. మ‌నువ‌డు.. అదే హిమాన్షు. ఇవే ప్రాణాలు. ఆ త‌రువాత రాజ‌కీయాలు. సీఎం సీటు. అంతే. ఇంకేం లేదు. ప‌ది కాలాల పాటు రాష్ట్రంలో త‌మ వార‌స‌త్వం ప‌చ్చ‌గా ప‌దిలంగా ఉండాలె! ఓర్నీ మ‌న‌వ‌డికి ఏదో దెబ్బ త‌గిలింద‌ని ప‌రామ‌ర్శ‌కొస్తే.. నీ ఏడుపేందిరో..?

స‌రే, రానీ, పోనీ! కానీ మ‌ధ్య మ‌ధ్య‌లో మా గురించి కూడా వ‌స్తే బాగుండు.. అనుకుంటున్నారు జ‌నాలు. అందుకే ఈ ముచ్చ‌ట‌. ఇది ఇప్పుడే చెప్పాల్నా? ఇప్పుడే అడ‌గాల్నా? అంటే.. మ‌రి లోప‌లికి పోయినంక‌.. గేట్లు బంద్ అయినంక‌.. డోర్లు మూత ప‌డ్డంక‌.. ఆ రాజ‌భ‌వ‌నంల‌కు రాజ‌మౌళి ఈగ కూడా చొర‌వ‌డ‌దంట‌.. అందుకే ఇప్పుడు చెప్పుకుంటే ఎవ‌రైనా ఒక‌ళ్లు చెవులేస్త‌రేమోన‌ని.

Advertisement

అరే.. రేవంతు రోజూ ఒర్రుత‌నే ఉన్న‌డు క‌ద‌రా బై.. వ‌స్త‌వా? రావా? రాకు. నిన్ను ప‌శుప‌తి లెక్క క‌ట్టేసినం…. అంటుండు క‌దా? ఇంత మాట‌న్నంక కూడా వొస్త‌లేడు. నువ్వు యాది చెయ్యంగ‌నే వ‌స్త‌డా? నేను రమ్మంట‌లేను బై.. జ‌నాలు అంటుండ్రు. కేటీఆరే చెప్తుండు క‌దా… అంతా కేసీఆర్ రావాలి .. రావాలి..!అని.

అందుకే ఊకే అండ్ల‌నే పండ‌క‌.. అదే ఉండ‌క‌.. అప్పుడ‌ప్పుడైనా ఇట్ల‌ ఆస్పిట‌ల్‌కు వ‌చ్చి చూసిన‌ట్టు మ‌మ్ముల సుక‌ ప‌ల‌క‌రించి, ప‌రామ‌ర్శించి, ఆరోగ్యం జాగ్ర‌త్త అని మంచి ముచ్చ‌ట చెప్పి.. నేనున్నా అని భ‌రోసా నింపి… నీకేమైనా నేనుంటా అని వెన్నుత‌ట్టి.. పోతే బాగుంటుంది క‌దా? అని నా అభిప్రాయం.. ఫీలింగు అన్న‌మాట‌.

ఆయ‌న రాక‌పోతే ఏందిరా బై. కేటీఆర్ తిర్గుతుండు క‌దా. మ‌స్తు. అయితే కేటీఆరే దిక్కు అని అనుకోవాల్నా? ఇంక కేసీఆర్ రాడు.. ఆడ‌నే ఉంట‌డు.. అట్ల‌నే ఉంట‌డు.. అని అనుకోమంట‌వా? కాదు క‌దా! అందుకే చివ‌రగా చెప్పొచ్చేదేందంటే.. మ‌నువ‌డి మీద ప్రేమ‌లో ఒక్క శాతం..ఒక్క‌టంటే ఒక్క శాతం మా మీద‌..అదే జ‌నం మీద‌.. రైతుల మీద‌, కార్మికుల మీద‌, ఉద్యోగుల మీద‌.. రాజ్యం మీద‌.. రాష్ట్రం మీద‌.. కార్య‌క‌ర్త‌ల మీద‌.. ఉద్య‌మ‌కారుల మీద‌, నిరుద్యోగుల మీద‌..!

ఇగ చాలు తియ్ మ‌స్తు చెప్పిన‌వ్. ప‌గటి క‌ల‌లు కంటున్న‌ట్టున్న‌వ్‌? ఆయ‌న్ను ఆ ఫామ్‌హౌజ్‌ల పండ‌వెట్టింది పోయి.. ఇప్పుడు రారాదే రారాదే.. అని దేవులాడుడెందుకు? అంటే పొగొట్టుకున్న చోట‌నే దేవులాడుకుందామ‌ని! దేవులాడుత‌నే ఉండు.. ఆ దేవుడు ఎప్పుడు రావాల్నో అప్పుడే ఒస్త‌డు. అప్ప‌టిదాకా అనుభ‌వించు.. అదే ప్రార్థించు. ప‌శ్చాత్తాప‌ప‌డు. చెంప‌లేసుకో. బుద్ది తెచ్చుకో. అర్థ‌మైందా? కాలేదా? అయితే ఇప్ప‌ట్ల రాడిగ‌. మీ ఖ‌ర్మ‌…

Related News

బీఆరెస్ కాస్కో..! భ‌రోసా వేసినం ఇగ చూస్కో..! ఢంకా బ‌జాయించి చెబుతాం దేఖ్‌లో…!

బీఆరెస్ తానా.. బీజేపీ తందానా! కాళేశ్వ‌రంపై మ‌ధ్య‌లో బీజేపీ జోక్యం.. ! రిపేర్లు ఎందుకు చేయ‌డం లేదు..?

మేం కేసీఆర్ లెక్క స‌గం ఇంజినీర్లం కాదు! వారం రోజుల సీఎం ప్ర‌తిపాద‌న‌పై మ‌హేశ్ కౌంట‌ర్‌!

ఇద్ద‌రిదీ కొలువుల బిల్డ‌ప్పే! నిరుద్యోగుల‌కు నాడు మోసం.. నేడు ద్రోహం.. !

మంత్రి లేకుండానే పర్యాటక రివ్యూ.. జూపల్లిని రేవంత్ రెడ్డి కూరలో కరివేపాకులా వాడేసి వదిలేశారా?

రైతు పండుగ‌ పోయి.. అప్పులపై స‌వాళ్లు వ‌చ్చె ఢాం ఢాం.. ఢాం! భ‌రోసా పోయి కాళేశ్వ‌రం వ‌చ్చె ఢాం ఢాం ఢాం..!

బీఎల్‌వోలు క‌నిపించ‌డం లేదు! ఇంటికొస్త‌లేరు.. ఫారాలు ఇస్త‌లేరు…! ఇట్లైతే ఎట్లా స‌ర్..?

Big Stories

Advertisement
×