Rajeev Kanakala:‘సమ్మర్ హాలిడేస్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సినిమా టీమ్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్ననటీనటులు తమ చిన్ననాటి వేసవి సెలవుల మెమోరీస్ ని పంచుకున్నారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల చెప్పిన విషయాలు అందరినీ తమ బాల్యంలోని రోజులను గుర్తు చేసుకునేలా చేశాయనే చెప్పాలి.
మొబైల్ గేమ్స్ కాదు.. క్రికెట్ మైదానాలే
ప్రస్తుత జనరేషన్ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఎలా ఉంటున్నాయనే విషయంపై రాజీవ్ కనకాల మాట్లాడుతూ తనకు తెలిసిన పిల్లలను గమనిస్తే ఎక్కువగా ఫ్రీ ఫైర్, పబ్జీ వంటి మొబైల్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పారు. వాటిలో డైమండ్స్, మాస్టర్ గ్రాండ్ మాస్టర్, ప్లాటినం అంటూ రకరకాల లెవల్స్ గురించి మాట్లాడుకుంటున్నారని సరదాగా చెప్పుకొచ్చారు.
అయితే తన చిన్నతనంలో ఇలా ఉండేది కాదని గుర్తుచేసుకున్నారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, స్నేహితులందరినీ సాయంత్రం ఆరు గంటలకు రావాలని బతిమాలి మరీ పిలిచేవాడినని చెప్పారు. అలా స్నేహితులందరినీ ఒకచోట చేర్చి ఆరు గంటల నుంచి రాత్రి 8.30, 9 గంటల వరకు క్రికెట్ ఆడేవాళ్లమని తెలిపారు.
ఆ తర్వాత ఇంటికి వచ్చి కాసేపు సినిమా చూసి, తండ్రి హోంవర్క్ చేయమని తిడితే చదువుకునేవాళ్లమని తన చిన్నతనంలో జరిగిన విషయాలని గుర్తు చేసుకున్నాడు ఎండలో ఎక్కువసేపు క్రికెట్ ఆడితే రంగు మారిపోతుందని తన తల్లి అంటుండేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు.ఇక తనకు గుంటూరు పుట్టిన ప్లేస్ అయినప్పటికీ అక్కడి పల్లెటూరి వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం రాలేదని తెలిపారు. ప్రస్తుతం గుంటూరు కూడా నగరంగా మారిపోయిందని వాపోయారు.
పిల్లల నటనపై రాజీవ్ కనకాల
ఇక ఈసమ్మర్ హాలిడేస్’ సినిమాలో నటించిన పిల్లల గురించి డైరక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ కొత్తవారితో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, కథలోని పాత్రలకు సరిపోయే ఇద్దరు పిల్లలు దొరకడం అదృష్టంగా భావించానని దర్శకుడు శ్రీకర్ చెప్పుకొచ్చాడు. మొదట్లో కొత్త నటీనటుల కోసం దాదాపు రెండు వారాల పాటు ప్రయత్నించానని అయితే చివరకు రోహన్, అరుణ్‌లతో వర్క్‌షాప్స్ నిర్వహించిన తర్వాత ఆ పాత్రలకు వాళ్లే సరైన వాళ్ళని అనుకున్నాని చెప్పారు.
హర్షినికి సవాలుగా మారిన తల్లి పాత్ర
ఈ సినిమాలో హర్షిని పోషించిన పాత్ర కూడా చాలా ప్రత్యేకమైనదని చర్చలో వెల్లడైంది. ఆమెకు ఇది తొలి సినిమా కాకపోయినా, ఇందులో పోషించిన తల్లి పాత్ర మాత్రం కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. సాధారణ నగర జీవితానికి అలవాటుపడిన తల్లిలా కాకుండా, పల్లెటూరి వాతావరణంలో జీవించే, చదువురాని మహిళగా తనను తాను మార్చుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఆ పాత్రలోని ఎమోషన్స్ అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సి వచ్చిందని, తనకు ఇది ఒక ఛాలెంజ్‌గా అనిపించిందని చెప్పుకొచ్చారు.అంతేకాదు, చిన్నపిల్లలతో కలిసి నటించడం, వారితో సీన్స్ చేయడం కూడా మంచి అనుభవమని తెలిపారు.
పిల్లల ప్రతిభ వెనుక తల్లిదండ్రుల కష్టం!
ఇక పిల్లల నటన గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఇప్పటి పిల్లలకు సీన్స్ ని త్వరగా అర్థం చేసుకునే కెపాసిటీ ఉందని, వారు చాలా వేగంగా ఈజీగా క్యాచ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.అయితే పిల్లల ప్రతిభ వెనుక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమని చెప్పారు. చదువులను చూసుకుంటూనే షూటింగ్స్‌కు తీసుకురావడం, ఎండలోనూ వానలోనూ పిల్లలతో పాటు ఉండటం, వారి కోసం సమయాన్ని కేటాయించడం చిన్న విషయం కాదని ఆకాశానికి ఎత్తేశారు రాజీవ్ కనకాల !
ALSO READ :ప్రదీప్, నస్లెన్‌తో నన్ను పోల్చకండి బాబోయ్.. మౌళి అసలు బాధ ఇదే!