Rajigadu Rajayyadu Teaser:టాలీవుడ్ లో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తున్న సంగతి తెల్సిందే.దీంతో ఇపుడు మరిన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగేందుకు సిద్దమవుతున్నాయి.అందులో భాగంగా ఆడియన్స్ ని అలరించేందుకు ఇపుడు మరో సినిమా రెడీ అయిపొయింది.అదే ‘రాజిగాడు రాజయ్యాడు’.
హీరో, దర్శకుడు అల్తాఫ్ హసన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి ప్రముఖ గీత రచయిత, సింగర్, యాక్టర్ డా. గోరటి వెంకన్న రావడం విశేషం.‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన అల్తాఫ్ హసన్.. ఈసారి మరో సరికొత్త జానర్ లో సినిమాని సిద్దం చేశారు .
మొదటి సినిమాలాగా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా పల్లెటూరి బతుకులు, సమాజంలోని పరిస్థితులు, సమానత్వం వంటి సోషల్ ఎలిమెంట్స్ ని ఇందులో భాగం చేయడం మెచ్చుకోతగ్గ విషయం.ఇక పల్లెల్లో ఇంకా కనిపిస్తున్న ఆధిపత్య ధోరణులు, వాటి వల్ల సామాన్య ప్రజలు పడే కష్టాలు, తమ హక్కుల కోసం వాళ్లు ఎలా నిలబడాలనే విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్.
ఇకపోతే ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో డా. గోరటి వెంకన్న మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయనే చెప్పాలి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు కళకు ఉండవని వేరే భాషల సినిమాలు ఇప్పటికే ఇలాంటి తేడాలు చెరిపేస్తున్నాయని, తెలుగులోనూ మంచి కథలకు వాల్యూ పెరుగుతోందని అన్నారు.
‘రాజిగాడు రాజయ్యాడు’ కథను తాను మూడుసార్లు చూశానని, అయినా ఎక్కడా బోర్ కొట్టలేదని చెప్పారు. ఎప్పుడూ వచ్చే రొటీన్ సినిమాలకు భిన్నంగా అల్తాఫ్ హసన్ ఈ సినిమాతో ఒక చరిత్ర సృష్టించబోతున్నారని మెచ్చుకున్నారు. ఇది ఏదో రాజకీయ నేపథ్యంతో తీసిన సినిమా కాదని, ఒక మనిషి జీవితాన్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ ఇస్తుందని అన్నారు.
ఇక ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జగదీశ్ సత్యన్ ఏకంగా ఏడు పాటలు ఇవ్వడం విశేషం. ఒక పాటను గోరటి వెంకన్న రాస్తే, మిగిలిన పాటలకు లక్ష్మణ్ లిరిక్స్ రాశారు. గోరటి వెంకన్న పాటలంటే తెలుగు వాళ్లకు ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఇక ఈ సినిమాలో అను శ్రీ హీరోయిన్ గా చేస్తున్నారు. ఇంతకుముందు ‘దేవగుడి’ సినిమాలో రాయలసీమ అమ్మాయిగా కనిపించిన ఆమె.. ఈసారి తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపించబోతుండటం విశేషం . ఇక ఈ సినిమాలో గోరటి వెంకన్న ఒక కీ రోల్ లో కనిపించబోతుండటంతో సినిమా ఎలా ఉండబోతుందా అని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
ALSO READ:యూత్ ఐకాన్‌గా అనన్య పాండే.. మరోసారి తన సత్తా చాటిన బ్యూటీ!
ఇక శర్మాస్ ఫిలింస్ బ్యానర్ మీద బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్నిల నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి రమేష్ సామల డైలాగ్స్ రాయగా, పి.ఎస్. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ చేశారు.మొత్తంగా ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారని, టీమ్ అంతా కలిసి పనిచేయడం వల్లే ప్రాజెక్ట్ ఈ స్థాయికి వచ్చిందని చెప్పుకొచ్చారు డైరెక్టర్ అల్తాఫ్ హసన్.చూడాలి మరి టీజర్ తో మొదలైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ తో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో !