Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాల పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాలను విడుదల చేస్తూ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన సత్యవాన్ సావిత్రి(Satyavaan Savitri) అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ గతంలో రాధిక ఆప్టే(Radhika Apte) చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు.
ఇటీవల కీర్తి సురేష్ నెట్ ఫ్లిక్స్ కోసం అక్క అనే సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈమె నటి రాధిక ఆప్టేతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా రాధిక ఆప్టే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణతో కలిసి నటించిన లెజెండ్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తన మామయ్యని పెళ్లి చేసుకున్నానని, కానీ త్వరలోనే నా పాత్ర చనిపోతుందని తెలిపారు. ఇలా మామయ్యను పెళ్లి చేసుకోవడం గురించి ఆమె మాట్లాడిన విధానం అలాగే ఈ విషయం ముందే తెలిసే ఉంటే సినిమాకు కమిట్ అయ్యేదాన్ని కాదు అంటూ ఈ సినిమాపై విమర్శలు చేశారు.
ఇలా రాధిక ఆప్టే సౌత్ సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న కీర్తి సురేష్ కూడా కాస్త నవ్వుతూ కనిపించారు. దీంతో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక తాజాగా సత్యవాన్ సావిత్రి ప్రమోషన్లలో భాగంగా ఈ వివాదం పై కీర్తి సురేష్ స్పందించారు. రాధిక ఆప్టే మాట్లాడుతున్నప్పుడు మొదట ఆమె ఏం మాట్లాడారనేది నాకు సరిగా అర్థం కాలేదని తెలిపారు. అనంతరం ఆమె దక్షిణాది సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారని తెలుసుకున్నానని, మన సంస్కృతి ఆచారాలను నేను ఎప్పటికీ తక్కువ చేసి చూడనని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల వారికి మన సాంప్రదాయాల గురించి తెలియవు కదా అంటూ కీర్తి సురేష్ ఈ సందర్భంగా ఆరాధికా ఆప్టే వివాదంపై స్పందించారు.
గతంలో కూడా రాధిక చేసిన వ్యాఖ్యల పట్ల కీర్తి స్పందించారు మేనమామను పెళ్లి చేసుకోవడం అనేది దక్షిణాది రాష్ట్రాలలో ఒక ఆచారంలో భాగమేనని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే కీర్తి క్లారిటీ ఇచ్చినప్పటికి ఈమెపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను తాను తక్కువ చేయనని క్లారిటీ ఇచ్చారు.. మరి ఇప్పటికైనా కీర్తి సురేష్ పై విమర్శలు ఆగుతాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక కీర్తి తెలుగులో జనవరి 12 విడుదల సినిమా ప్రమోషన్లలో కూడా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.
Also Read: ప్రమోషన్లు అంటే చాలు వచ్చేస్తాడు.. కొత్త సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి