E-Paper
Advertisement

యూత్ ఐకాన్‌గా అనన్య పాండే.. మరోసారి తన సత్తా చాటిన బ్యూటీ!

యూత్ ఐకాన్‌గా అనన్య పాండే.. మరోసారి తన సత్తా చాటిన బ్యూటీ!
Advertisement

Ananya Panday:అనన్య పాండే..బాలీవుడ్ యంగ్ బ్యూటీ గా క్రేజ్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరోసారి తన స్టైలిష్ లుక్‌తో నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది.ఒక వైపు సినిమాలతోపాటు ప్యాషన్ వరల్డ్ లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా ‘వోగ్ ఇండియా’ (Vogue India) తనకి గురింపు ఇవ్వడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టేసింది.

తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ వోగ్ ఇండియాకు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పింది. ముఖ్యంగా ‘ఫోర్సెస్ ఆఫ్ ఫ్యాషన్’ అవార్డ్స్‌లో తనకు దక్కిన ఈ గౌరవం ఎంతో ప్రత్యేకమని ఎమోషనల్ అయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో అనన్య షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఇక తాజాగా వదిలిన ఈ ఫొటోల్లో అనన్య పాండే క్లాసీగా, అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో, లూజ్ హెయిర్‌తో, తనదైన క్యూట్ అండ్ బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనన్య అభిమానుల మతులు పోగొడుతుందనే చెప్పాలి.

ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ టోన్‌లో ఉన్న ఈ ఫొటోషూట్ ఈ బ్యూటీ అందాన్ని మరింత హైలైట్ చేస్తోందనడంలో సందేహం లేదు. ఇక ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ లుక్‌తోనే అందరిని తనవైపు తిప్పేసుకోవడంతో నెట్టింట సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా కేవలం సినిమాల్లోనే కాదు, ఫ్యాషన్ విషయంలోనూ అనన్య తనదైన ట్రెండ్ సెట్ చేస్తోందని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

నిజానికి అనన్య పాండేకు ఫ్యాషన్ రంగంలో ఇలాంటి గుర్తింపు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా ప్రముఖ ఫ్యాషన్ ఈవెంట్స్‌లో తన స్టైలింగ్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 2024లో జరిగిన వోగ్ ఇండియా ఫోర్సెస్ ఆఫ్ ఫ్యాషన్ వేడుకలో ఆమెకు ‘బ్రేకౌట్ స్టార్’ గుర్తింపు దక్కింది.

అంతేకాదు, అదే ఏడాది ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో ‘యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును కూడా అందుకుని తన క్రేజ్ ఏంటో చూపించింది. ఈ రెండు అవార్డులు ఆమె కెరీర్‌లో మర్చిపోలేని మైలురాళ్లుగా నిలిచిపోయాయనే చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. 2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ కిడ్, ఆ తర్వాత పతి పత్నీ ఔర్ వో, ఖాళీ పీలీ, గెహ్రాయియాన్, లైగర్, డ్రీమ్ గర్ల్ 2 లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘లైగర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది.

మరోవైపు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా ‘ఖో గయే హమ్ కహాన్’ సినిమాలో అహానా పాత్రతో తన నటనలో మరో యాంగిల్ ని బయటపెట్టింది ఈ అందాల భామ.ఆ తర్వాత ‘సీటీఆర్ఎల్’ (CTRL) లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతోనూ ప్రయోగాలు చేసి మెప్పించింది కూడా.

ఇక 2026లో లక్ష్యతో కలిసి నటించిన ‘చాంద్ మేరా దిల్’ సినిమాతో మరోసారి ఆడియన్స్ ని అలరించింది.మొత్తానికి ఒకవైపు నటిగా తన రేంజ్ పెంచుకుంటూనే, మరోవైపు ఫ్యాషన్ వరల్డ్‌లోనూ అనన్య పాండే పాతుకుపోయే పోయే పనిలో పడిందన్న మాట !

Tags

Related News

రాధిక ఆప్టే వ్యాఖ్యలపై స్పందించిన కీర్తి సురేష్..ఏమన్నారంటే?

ప్రమోషన్లు అంటే చాలు వచ్చేస్తాడు.. కొత్త సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి

రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం పై సోనాక్షి సిన్హా కౌంటర్!

రామ్ పోతినేని నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్!

‘జనవరి 12 విడుదల’ టాప్ ప్రొడ్యూసర్ చేతికి నైజాం రైట్స్..ఇక లాభాల పంటే?

టైం 100 నెక్స్ట్ ఇండియా కవర్ పేజీ పై బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి ప్రశంసలు!

ఏం టాలెంట్ గురూ.. సంయుక్త ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్న అభిమానులు!

Big Stories

Advertisement
×