Coolie Overseas Rights: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) త్వరలోనే కూలీ సినిమా (Coolie Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అదేవిధంగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం రజనీకాంత్ ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలాగా ఉన్నారు.
ఓవర్సీస్ రైట్స్ కైవసం చేసుకున్న హంసిని…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులకు(Overseas Rights) సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్(Hamsini Entertainments) కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇదివరకు రజనీకాంత్ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా కూలీ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఏకంగా 86 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవటం విశేషం. ఈ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ కైవసం చేసుకున్నారంటే అక్కడ ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ డైరెక్షన్లో తలైవా నటిస్తున్న చిత్రం కావడమే కాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి.
భాగమైన భారీ తారాగణం..
ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉఫేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన నటిస్తున్న చిత్రం కావడంతో కూలీ సినిమాపై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను కూడా భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తుంది.
రజనీకాంత్ కెరియర్ లోనే హైయెస్ట్…
కూలి సినిమా తెలుగు రైట్స్ ఏషియన్ సునీల్ నారంగ్(Suneil Narang), దిల్ రాజు కలిసి సుమారు 44 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ ఉన్నప్పటికీ చివరికి సునీల్ నారంగ్ కైవసం చేసుకున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కెరీర్ లోనే ఇదే అత్యధిక ధరకు అమ్ముడైన తెలుగు రైట్స్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన సినిమాలు ఇప్పటివరకు 74 కోట్ల వరకు ఓవర్సీస్ రైట్స్ ధరలు పలికాయి. అయితే కూలి సినిమాకు ఏకంగా 86 కోట్లు కావడంతో ఇదే హైయెస్ట్ అని తెలుస్తోంది. మరి ఆగస్టు 14వ తేదీ రాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాల్సి ఉంది.