Agent Sai Srinivas Athreya 2: ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాలు సరికొత్త ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ రావడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలకు మాత్రమే కాదండోయ్ గతంలో కూడా విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలకు కూడా సీక్వెల్స్ (Sequels)ప్రకటించడం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సీక్వెల్ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరొక టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్ సినిమా కూడా చేరిపోయిందని తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(Agent Sai Srinivas Athreya) సినిమాకు సీక్వెల్స్ సిద్ధం కాబోతుందని తెలుస్తోంది.
డిటెక్టివ్ పాత్రలో నవీన్ పోలిశెట్టి..
నవీన్ పోలిశెట్టిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. కేవలం ఒక కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది అంటే ఈ సినిమాకు ఏ స్థాయిలో ఆదరణ వచ్చిందో స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టికి జోడిగా శృతి వర్మ (Shruthi Varma)హీరోయిన్గా నటించారు. స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించాడు. ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు కొనసాగింపుగా మరొక సినిమా చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఒక స్టోరీ లైన్ ఇప్పటికే హీరో నవీన్ పోలిశెట్టికి కూడా వినిపించారట.
భారీ బడ్జెట్ తో సీక్వెల్…
ఈ స్టోరీ లైన్ నచ్చడంతో కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వరకు జరుగుతోందని, ఈ పని పూర్తి అయిన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి భాగం కంటే కూడా రెండవ భాగం మరింత వినోదాత్మకంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని స్పష్టమవుతుంది.
అనగనగా ఒక రాజు…
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పోలీస్ శెట్టి తదుపరి జాతి రత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన అనగనగా ఒక రాజు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Thug Life Ott Streaming: నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చిన థగ్ లైఫ్.. ఇక్కడైనా హిట్ కొట్టేనా?