E-Paper
Advertisement

మళ్లీ మొదలైన మున్నాభాయ్ మ్యాజిక్.. అర్షద్ వార్సీ, హిరాని కాంబోలో కొత్త సిరీస్!

మళ్లీ మొదలైన మున్నాభాయ్ మ్యాజిక్.. అర్షద్ వార్సీ, హిరాని కాంబోలో కొత్త సిరీస్!
Advertisement

Hirani OTT : వరుస పెట్టి సినిమాలు ..వందల కోట్ల వసూళ్లు..ఇదీ బాలీవుడ్ తీరు.కాని వీటికి నేను చాలా దూరం అంటూ తనదైన పంథాలో సాగిపోతుంటాడు జీనియస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు చూస్తేనే ఆ విషయం క్లియర్ గా తెల్సిపోతుంది కూడా. ఇక నెంబర్స్ పరంగా చేసినవి తక్కువే అయినా వాటి ఇంపాక్ట్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ అన్నది తెలీంది కాదు.మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, సంజు వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన హిరాని, చివరిగా షారుఖ్ ఖాన్ హీరోగా డంకి సినిమాతో ఆడియన్స్ ని పలకరించారు.అయితే ఆ డంకి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి బ్లాక్ బస్టర్ కాకపోయినా, ఒక డీసెంట్ హిట్‌గా నిలిచిందనే చెప్పాలి.

కంటెంట్ ఈజ్ కింగ్

Advertisement

ఇక హిరాని సినిమాలలో కంటెంట్ ఈజ్ కింగ్ అని ఇప్పటికే ఆడియన్స్ లో ఒక స్టాంప్ పడిపోయింది.అయితే డంకి తర్వాత ఇప్పటికీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అంటూ క్యూరియస్ గా ఆరాలు తీసేపనిలో పడ్డారంతా.ఈ క్రమంలో త్రీ ఇడియట్స్ సీక్వెల్ అని, మున్నాభాయ్ మూడో భాగం అని రకరకాల రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నా ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్ అయితే రాలేదు.ఇక ఈ రూమర్స్ ఇలా చక్కర్లు కొడుతుండగానే రాజ్ కుమార్ హిరాని తన అభిమానులకు ఒక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక వైపు సినిమాలపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. యస్ ..ఆయన షో రన్నర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ప్రీతమ్ అండ్ పెడ్రో. ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ లో జులై 3, 2026 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

దొంగతనం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ డ్రామా 

Advertisement

ఈ ప్రాజెక్టుకు అవినాశ్ అరుణ్ దర్శకత్వం వహించగా, ఇందులో హిరాని తనయుడు వీర్ హిరాని ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం.నిజానికి హిరానీ తలుచుకుంటే తన సినిమా ద్వారానే సాలిడ్ గా లాంచ్ చేసే అవకాశం ఉంది.కానీ ఒక వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియం ద్వారా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడంటే హిరానికి సిరీస్ ఎంతగా నచ్చి ఉండాలో అర్థం చేసుకోవచ్చు.

పైగా, మున్నాభాయ్ సిరీస్ తో హిరానితో విడదీయలేని అనుబంధం ఉన్న అర్షద్ వార్సీ ఇందులో మరో కీలక పాత్ర పోషించడం సిరీస్‌పై అంచనాలను భారీగా పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి చూస్తే, ఇది ఒక ఏటీఎం దొంగతనం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ మరియు ఫన్నీ కథాంశంగా అనిపిస్తోంది. హిరాని సినిమాల్లో ఉండే హ్యూమర్, ఎమోషన్ ఇందులో కూడా పుష్కలంగా ఉంటాయని ఆశిస్తున్నారు ఆడియన్స్ . ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత, హిరాని తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్.

త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్

ముఖ్యంగా ఆమిర్ ఖాన్ తో కలిసి ఆయన త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఒకపక్క వెబ్ సిరీస్ ప్రమోషన్లు, మరోపక్క ఆమిర్ ఖాన్ తో సినిమా చర్చలు.. మొత్తానికి రాజ్ కుమార్ హిరాని తనదైన శైలిలో మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారన్న మాట. చూడాలి సిల్వర్ స్క్రీన్ పై  తనదైన  స్టాంప్ వేసిన హిరాని ఓటిటిలో ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×