E-Paper
Advertisement

ట్విస్ట్ అదిరింది.. ఆలూ చిప్స్, వాటర్ బాటిల్స్ అనుకుంటే షాకే.. లోపల రూ.3 కోట్ల గంజాయి!

ట్విస్ట్ అదిరింది.. ఆలూ చిప్స్, వాటర్ బాటిల్స్ అనుకుంటే షాకే.. లోపల రూ.3 కోట్ల గంజాయి!
Advertisement

Hyderabad Airport: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి భారీ డ్రగ్స్ రవాణాకు వేదికైంది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇద్దరు ప్రయాణికులు ఎవరికీ అనుమానం రాకుండా లగేజీ బ్యాగుల్లో డ్రగ్స్ దాచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, పక్కా సమాచారంతో నిఘా ఉంచిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తనిఖీలు చేపట్టి, వారి వద్ద ఉన్న భారీ గంజాయి నిల్వలను బయటపెట్టారు.

నిందితుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు వాటర్ బాటిల్స్, ఆలూ చిప్స్ ప్యాకెట్లు, కొన్ని రకాల డబ్బాలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా లోపల అత్యంత ఖరీదైన ‘హైడ్రోఫోనికల్ గంజాయి’ బయటపడింది. మొత్తం 24 ప్యాకెట్లలో దాచిన ఈ గంజాయి బరువు సుమారు 8.705 కిలోలుగా అధికారులు తేల్చారు. సాధారణ గంజాయితో పోలిస్తే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటంతో, పట్టుబడిన సరుకు విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 3.05 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

సాధారణంగా మట్టి లేకుండా కేవలం ప్రత్యేక పోషకాలతో కూడిన నీటిలోనే ఇండోర్ పద్ధతిలో ఈ హైడ్రోఫోనిక్ గంజాయిని సాగు చేస్తారు. దీని తీవ్రత, కిక్ చాలా ఎక్కువగా ఉండటం వల్లే దీనికింత డిమాండ్. ప్రస్తుతం అధికారులు ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ డ్రగ్స్ ఎవరికి సరఫరా చేయాలనుకున్నారు? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో డీఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు!

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×