E-Paper
Advertisement

Google Top Search: అత్యధిక ప్రజాధారణ పొందిన హీరోయిన్స్.. మొదటి స్థానం ?

Google Top Search: అత్యధిక ప్రజాధారణ పొందిన హీరోయిన్స్.. మొదటి స్థానం ?
Advertisement

Google Top Search:ఒకప్పుడు హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ప్రేక్షకుల అభిరుచి మారింది అటు హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా పోటీపడుతూ సినిమాలు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే భిన్నవిభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా.. వారి చేత అత్యధిక ప్రజాదారణ పొందిన నటీమణులుగా రికార్డులు సృష్టిస్తున్నారు. కొంతమంది సూపర్ హీరో కాన్సెప్ట్ లో సినిమాలు చేస్తే.. మరికొంతమంది యువరాణులుగా, మహారాణులుగా, లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అదరగొట్టేస్తున్నారు.

ఇంకొంతమంది హారర్ చిత్రాలతో బెదరగొడుతున్నారు. ఇంకొంతమంది ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఇంకొంతమంది గర్ల్ ఫ్రెండ్ గా కనిపిస్తూ అందరి హృదయాలను దోచుకుంటున్నారు. ఇంకొంతమంది ఎమోషనల్ తో కట్టిపడేస్తున్నారు.. ఇలా ఒక్కరేమిటి చాలామంది హీరోయిన్స్ లో.. వారి ఆలోచనలలో మార్పు వచ్చింది. ఆ మార్పుకు తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించి అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోయిన్స్ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ స్థానంలో ఎవరు ఏ స్థానాన్ని దక్కించుకున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

అత్యధిక ప్రజాధరణ పొందిన హీరోయిన్స్..

Advertisement

సాధారణంగా ఆర్మాక్స్, ఐఎండిబి వంటి సంస్థలు అత్యధిక ప్రజాదారణ పొందిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఏకంగా గూగుల్లో టాప్ సెర్చ్ హీరోయిన్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ జాబితాలో తమన్నా భాటియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది హీరోయిన్గా సినిమాలు చేయకపోయినా అటు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ స్పెషల్ సాంగ్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకొని పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది తమన్న. అలా ఈ ఏడాది అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోయిన్గా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

రెండవ స్థానంలో రష్మిక..

ఇక ఆ తర్వాత స్థానంలో రష్మిక మందన్న చోటు దక్కించుకుంది. ఈ ఏడాది తెలుగు, తమిళ్, హిందీ అంటూ ఏకంగా మూడు భాషలలో ఐదు సినిమాలు చేసి సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకొని ఈ ఏడాది అత్యధిక ప్రజాదారణ కలిగిన హీరోయిన్గా రెండవ స్థానాన్ని సంపాదించుకుంది.

Advertisement

ALSO READ:Rashmika mandanna: ఆ అభద్రత భావమే నన్ను ఈ స్థాయికి చేర్చింది..

ఆ తర్వాతి స్థానాలు వీరివే..

మూడవ స్థానాన్ని సంపాదించుకుంది సమంత. ఈ ఏడాది హీరోయిన్గా నటించకపోయినా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి, నిర్మాతగా తొలి ప్రయత్నాన్ని చేసింది. అలా తొలి ప్రయత్నంలో శుభం అనే సినిమా చేసి సక్సెస్ అందుకుంది. ఇందులో మాయ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు మరొకవైపు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉండడమే కాకుండా ఈ ఏడాది డిసెంబర్ 1న ఆయనతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అలా ఈ ఏడాది ఆమె అత్యధిక ప్రజాదారణ పొందిన హీరోయిన్గా మూడవ స్థానాన్ని సంపాదించుకుంది. ఇక మిగిలిన స్థానాలలో నాలుగవ స్థానంలో కియారా అద్వానీ, ఐదవ స్థానంలో శ్రీ లీల నిలిచారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×