E-Paper
Advertisement

జీవితాంతం ప్రేమ.. సంతోషాలు.. రామలక్ష్మికి చిట్టిబాబు కంగ్రాట్స్ !

జీవితాంతం ప్రేమ.. సంతోషాలు.. రామలక్ష్మికి చిట్టిబాబు కంగ్రాట్స్ !
Advertisement

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ఈమె నవంబర్ 19వ తేదీ బాబుకు జన్మనివ్వటమే కాకుండా తమ కొడుకుకి దేవ్ నిడిమోరు( Dev Nidimoru) అని నామకరణం చేసినట్టు తెలియచేశారు. ఈ విధంగా సమంత రాజ్ నిడిమోరు(raj nidimoru) దంపతులకు బాబు జన్మించారనే విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులు సినిమా సెలబ్రిటీలు సమంత(samantha) దంపతులకు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు రామ్ చరణ్ సైతం సమంత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సమంత రాజ్ లకు అభినందనలు..

రామ్ చరణ్ తాజాగా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సమంత రాజ్ దంపతులను ఉద్దేశించి పోస్ట్ చేశారు. “ప్రియమైన సమంత, రాజ్ లకు మీ చిన్నారి రాక సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఇద్దరికీ, ఆ చిన్నారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను”అంటూ చరణ్ ఈ సందర్భంగా సమంత రాజ్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ (Ram Charan)సమంత విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి రంగస్థలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో సమంత రామలక్ష్మి అనే పాత్రలో నటించగా చరణ్ చిట్టిబాబు అనే పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మొదటి సంతానంలోనే అబ్బాయి..

Advertisement

ఇలా ఈ సినిమా నుంచి వీరిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సమంతకు అభినందనలు తెలుపుతూ చరణ్ పోస్ట్ చేశారు. ఇక సమంత మొదటి సంతానంలో భాగంగా అబ్బాయి జన్మించడంతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇక సమంత తన కొడుకు చేతి వేలిని పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని రివిల్ చేశారు కానీ తన ఫేస్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో దేవ్ నిడిమోరు ఎలా ఉంటారో చూడాలని అభిమానులు ఆత్రుత వ్యక్తం చేస్తున్నారు.

https:https://twitter.com/AlwaysRamCharan/status/2124143924524744786?a=8DvxKK_Eg10ZoEG_rSE&s=08

Advertisement

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే ఈయన దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై మెగా ఫ్యాన్స్అయోమయంలో ఉన్నారు. ఒకానొక సమయంలో రామ్ చరణ్ జోడిగా ఈ సినిమాలో సమంత నటించబోతుందని, మరోసారి రంగస్థలం కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా సమంత నటిస్తుంది అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టమవుతుంది.

Also Read: ఒసేయ్ రాములమ్మ పాట రిక్రియేషన్.. భయపడ్డానన్న రష్మిక.. ఎందుకంటే?

Related News

నెట్‌ఫ్లిక్స్‌లో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. వరుసగా నాలుగు సినిమాలతో టాప్ ట్రెండింగ్!

ఒసేయ్ రాములమ్మ పాట రిక్రియేషన్.. భయపడ్డానన్న రష్మిక.. ఎందుకంటే?

ఇయర్ ఎండ్‌కు టాలీవుడ్ ట్విస్ట్.. ‘మైసా’, ‘వృషకర్మ’, ‘కింగ్ 100’ డేట్స్ మారుతున్నాయా?

పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభించిన ఉపాసన కొణిదెల..

రూ.40 కోట్లతో అదరగొట్టిన ధనుష్.. కానీ అసలు పరీక్ష ఇప్పుడే!

ఎంతో బిజీగా ఉన్నా ఆ పాటలు వింటే రిలాక్స్ అవుతా.. తన మ్యూజిక్ టేస్ట్ బయటపెట్టిన వేణుస్వామి!

చరణ్ సినిమా.. హీరోయిన్ విషయంలో అంతా గందరగోళమే!

Big Stories

Advertisement
×