Jadcherla Incident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాచారం సమీపంలో ముందు వెళుతున్న లారీని వెనుకనుంచి వస్తున్న బస్సు ఢీ కొట్టడంతో బస్సులో ప్రయణిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు, మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయిని తెలిపారు.
ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు..
అయితే ముఖ్యంగా ఇది బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రైవేట్ బస్సులోని డ్రైవర్, బస్సులోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని కూకట్ పల్లికి చెందిన లక్ష్మిదేవి, రాధికగా గుర్తించారు. అలాగే వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందిన అత్త కోడలుగా గుర్తించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయణికులు ఉన్నారు. ఇందులో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. అయితే క్షతగాత్రులను అక్కడి సమీపంలోని జడ్జర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో బస్సు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ ప్రమాదం జరగడంతో అతని తల, మొండం రెండు వేరయ్యాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి.. ఇలా రోజు అనేక ప్రమాదాలు జరిగిన ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండడం లేదు.
అయితే ఈ ఘటనకు కారణం మితిమీరిన వేగం అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జాతీయ రహాదారిపై జామ్ అయిన ట్రాఫిక్‌ను పోలీసులు తొలగిస్తున్నారు. అంతేకాకుండా ఘటనకు సంబందించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
Also Read: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియాపై దృష్టి
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ మంచిరేవులలో గుట్టపై ఉన్న పెద్ బండ రాయి వర్షం దాటికి రోడ్డుపై పడింది. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. అయితే పెద్ద పెద్ద బండరాళ్లను కెమికల్స్ సహాయంతో ముక్కలు చేసి కొంతమంది వ్యక్తులు వాటిని ఫ్లాటింగ్ చేసి అమ్ముకుంటున్నారని సమాచారం. స్థలం ప్రైవేట్ వ్యక్తులదైతే పర్మిషన్ అవసరం లేదా.. పర్మిషన్ ఉన్నా.. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోరా అని ప్రశ్నలు కలుగుతున్నాయి. 50ఫీట్‌ల మేర రాళ్లను, మట్టిని తొలగించడం వల్ల.. వర్షం కురిసినప్పుడు పక్కన ఉన్న గుట్టలపైన మట్టి చిన్నగా కొట్టుకుపోయి రాళ్లు కిందపడుతున్నాయి. గతంలొనూ ఇలా జరిగాయి. అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.