E-Paper
Advertisement

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!

ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!
Advertisement

Ambir Cheruvu: స్వేచ్ఛ బ్యూరో: ప్ర‌గ‌తిన‌గ‌ర్ లోని అంబీర్ చెరువును అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా అభివృద్ధి చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ వెల్లడించారు. చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాటు పెద్ద‌మొత్తంలో పేరుకుపోయిన పూడిక‌ను తొల‌గించి చెరువు ఉండే స‌హ‌జ ల‌క్ష‌ణాల‌న్నిటినీ పున‌రుద్ధ‌రిస్తామ‌ని కూడా ఆయన స్పష్టం చేశారు. అత్య‌ధిక జ‌న‌సాంధ్ర‌త ఉన్నఈ ప్రాంతంలో అంబీర్‌ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, ఆహ్లాదక‌రంగా మార్చుతామ‌ని వివరించారు. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను స్థానిక ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీతో క‌లిసి హైడ్రా కమిష‌న‌ర్ శుక్ర‌వారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు చెరువు చెంత‌న జ‌మ్మిచెట్టును కూడా నాటి ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ‌కారం చుట్టారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ..

Advertisement

ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాస్త‌వానికి ఈ చెరువు విస్తీర్ణం 162 ఎక‌రాలు కాగా, ప్ర‌స్తుతం 121.2 ఎక‌రాల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. అవ‌కాశం ఉన్న మేర‌కు ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి దీనిని 135.8 ఎక‌రాల‌కు విస్త‌రిస్తున్నామని తెలిపారు. చెరువు చుట్టూ బండ్ ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్‌లు, పిల్ల‌ల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు, చెరువు చెంత‌కు వ‌చ్చి సేద‌దీరే విధంగా కూర్చొనే వెసులుబాటు క‌ల్పిస్తూ గ‌జబోలు నిర్మిస్తామ‌న్నారు. చెరువు మ‌ధ్య ఉన్న కొండ‌ల చెంత సాహ‌స క్రీడ‌ల‌కు ఆస్కారం క‌ల్పిస్తూనే, బోటింగ్ జెట్టీల‌ను ఏర్పాటు చేసి బోటు షికారును, వాట‌ర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తెస్తామ‌న్నారు. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్‌లోని కంకారియా లేక్ కార్నివాల మాదిరి ప్ర‌గ‌తిన‌గ‌ర్‌లోని అంబీర్ చెరువు ఫెస్టివ‌ల్‌ను కూడా నిర్వ‌హించుకునేలా ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు.

ప‌ర్యావ‌ర‌ణ హితంగా సుందరీకరణ

Advertisement

ఎటు చూసినా నివాస ప్రాంతాలు, అత్య‌ధిక జ‌నాభా నివ‌సిస్తున్న ఈ ప్రాంతంలో అంబీర్ చెరువును ప‌ర్యావ‌ర‌ణ‌హితంగా, ప‌ర్యాట‌కంగా తీర్చిదిద్దుతామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ తెలిపారు. చెరువుకు ఉండాల్సిన అన్ని స‌హ‌జ‌ల‌క్ష‌ణాల‌ను పున‌రుద్ధ‌రించి ఈ ప్రాంతంలో వ‌ర‌ద ముప్పు లేకుండా చేయ‌డంతో పాటు, భూగ‌ర్భ జ‌లాలు పెంపొందించే విధంగా చెరువును అభివృద్ధి చేస్తామ‌న్నారు. 10.23 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల నుంచి పెద్ద‌ మొత్తంలో వ‌ర‌ద నీరు ఈ చెరువ‌కున్న 6 ఇన్‌లెట్ల‌ను అభివృద్ధి చేసి, వ‌ర్ష‌పు నీరు నేరుగా చెరువులో క‌లిసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చెరువులో నాలుగైదు మీట‌ర్ల మేర పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను తొల‌గించి దుర్గంధాన్ని తొలగిస్తామన్నారు. చెరువు మ‌ధ్య‌లో ఉన్న ర‌హ‌దారిని కూడా విస్త‌రించి, అక్క‌డ ప్ర‌జ‌లు సుల‌భంగా రోడ్డు దాటేందుకు వీలుగా స్కై వాక్ వంతెన‌ను నిర్మించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ప్ర‌గ‌తిన‌గ‌ర్‌కు వెళ్లే రహ‌దారికి ఇరువైపులా ఉన్న చెరువును ముందుగా ఒక‌వైపు అభివృద్ధి చేసి, ఆ త‌ర్వాత మ‌రో వైపు చేస్తామ‌న్నారు. దీంతో ఇక్క‌డ చెరువులో నీరు నీటిని పూర్తిగా తొల‌గించ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. చెరువు ప‌రిస‌ర ప్రాంతాల రూపురేఖ‌లు మార‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. త‌మ్మిడికుంట చెరువును మించి దీనిని అభివృద్ధి చేసి స్థానిక ప్ర‌జ‌ల‌కు బ‌హుమ‌తిగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

హైడ్రాకు అంద‌రి స‌హ‌కరిస్తాం: ఎమ్మెల్యే గాంధీ

గొలుసుక‌ట్టు చెరువుల‌ను పున‌రుద్ధ‌రించి వ‌ర్షాకాలం వ‌ర‌ద‌లు, వేస‌వికాలం నీటి ఎద్ద‌డి లేని న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌న్న ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆశ‌యాల మేర‌కు హైడ్రా ప‌ని చేస్తోంద‌ని, హైడ్రా చేపట్టే చెరువుల పునరుద్దరణకు అన్ని రకాలుగా సహకరిస్తామని శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా, వాటిని సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించి ముందుకు వెళ్తున్న హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ పని తీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. హైడ్రాను ఆదిలో వ్య‌తిరేకించిన వారూ కూడా ఇప్పుడు అభినందిస్తున్నార‌న్నారు. చెరువుల్లో పూడిక‌ను మొత్తం తొల‌గించి, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్న తీరును గ‌మ‌నించిన ప్ర‌జ‌లు ఇప్పుడు హైడ్రాకు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌న్నారు. నగరంలోని చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, నగర సుందరీకరణకు దోహదపడే ప్రకృతి కేంద్రాలుగా హైడ్రా తీర్చిదిద్దుతుందని కితాబిచ్చారు. హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి. ఆనంద్‌కుమార్, ఏసీపీ పి. తిరుమ‌ల్ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి ప్ర‌ణాళికు సంబంధించిన వివ‌రాల‌ను డీపీఆర్‌ను రూపొందించిన విమోస్ టెక్నోక్రాట్స్ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు.

Also Read: సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

Tags

Related News

హెచ్‌సీయూలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

సాగర్‌ వివాదంలో అసలు దోషులెవరు? అధికారులదా.. ప్రభుత్వానిదా?

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’.. రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి ధ్వజం!

మూడేళ్లలో రూ.4.5 లక్షల కోట్ల అప్పు.. ఆ డబ్బు ఏమైంది? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు!

మంత్రులు, సీఎం తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి నిజమేనా? 27న సందీప్ ముందు తేలనున్న లెక్క!

అక్రమ అండాల కేసులో హైకోర్టు సీరియస్.. ఐవీఎఫ్ కేంద్రాల తీరుపై తీవ్ర ఆగ్రహం

ఉపాధి కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష!

Big Stories

Advertisement
×