Allu Sirish:మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలచినట్టు.. అల్లు శిరీష్ (Allu Sirish) ఎంగేజ్మెంట్ విషయంలో ఇదే జరిగింది అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగానే నిలిచిన అల్లు శిరీష్.. ఎట్టకేలకు తాను ప్రేమించిన నైనిక అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కు సిద్ధమైనట్లు ఇటీవల తన తాత , దివంగత నటులు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంట నిశ్చితార్థం కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరిచారు.
ఈ మేరకు అల్లు శిరీష్.. ఒక అమ్మాయిని ప్రేమించాను.. ఇంట్లో ఒప్పుకున్నారు.. త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నామని ప్రకటించాడు. కానీ అమ్మాయి ఫేస్ రివీల్ చేయలేదు. కేవలం ఈఫిల్ టవర్ దగ్గర ఇద్దరు చేతులు పట్టుకున్న ఒక ఫోటోని మాత్రమే పంచుకున్నారు. దీంతో అమ్మాయి ఎలా ఉంటుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఇటీవల అల్లు అర్జున్ ఇంట దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరగగా.. ఆ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ భార్య స్నేహ నైనిక ఫేస్ రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ జంట చాలా చక్కగా ఉంది అని అభిమానులు కామెంట్లు చేశారు.
ALSO READ:Bigg Boss 9 Promo: డైరెక్టర్ గా మారిన ఇమ్మూ.. పాపం రీతూ!
ఇకపోతే అల్లు శిరీష్ నిశ్చితార్థం అక్టోబర్ 31వ తేదీన జరగాల్సి ఉంది. హైదరాబాదులోని తమ సొంత ఇంట్లోనే ఈ నిశ్చితార్థ వేడుకను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ అందరి చేత పాపం అనిపిస్తోంది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. వర్షం పడుతుండగా డెకరేషన్ వర్క్స్ ఫోటో తీసి చలికాలంలో అవుట్డోర్లో నిశ్చితార్థం ప్లాన్ చేసుకున్నాను. కానీ వాతావరణం అనుకూలించలేదు. ఇక్కడ దేవుడు స్క్రిప్ట్ మాత్రమే నడుస్తోంది.. పైగా దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి కదా అంటూ పోస్ట్ చేశాడు. అల్లు శిరీష్ తన నిశ్చితార్థాన్ని.. బయట మంచి డెకరేషన్ చేసుకొని చేయించుకుందామని ప్లాన్ చేసుకున్నాడేమో.. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తో హైదరాబాదులో కూడా అధిక వర్షాలు పడి డెకరేషన్ వరకు కూడా ఆగిపోయింది. అందుకే అల్లు శిరీష్ ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పాపం అల్లు శిరీష్ ఓపెన్ ప్లేస్ లో వెన్నెల వెలుగుల్లో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుందామనుకున్నాడు. వర్షం దెబ్బకు ఆశలన్నీ అడియాశలైపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈరోజు, రేపు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాబట్టి అల్లు శిరీష్ తాను అనుకున్నట్లుగానే అవుట్డోర్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటారా లేక మళ్ళీ దేవుడు కరుణించకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది.