BigTV English

Smoothies For Energy: ఈ స్మూతీస్ తాగితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Smoothies For Energy: ఈ స్మూతీస్ తాగితే.. రోజంతా ఫుల్ ఎనర్జీ

Smoothies For Energy: రోజువారీ జీవితంలో చురుకుగా, ఉత్సాహంగా ఉండాలంటే సరైన ఆహారం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం పూట శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటాం. దీనికి హై-ప్రొటీన్ స్మూతీలు ఒక అద్భుతమైన మార్గం. ఇవి కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా.. పుష్కలంగా పోషకాలను కలిగి ఉంటాయి. రోజంతా ఫుల్ ఎనర్జీతో, యాక్టీవ్ గా ఉండాలంటే ఎలాంటి స్మూతీస్ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.


1. బనానా & ఆల్మండ్ బటర్ స్మూతీ:
చాలా మంది అరటిపండ, బాదం బటర్‌లతో స్మూతీ తయారు చేసుకుని తాగుతుంటారు. అరటిపండు తక్షణ శక్తిని ఇస్తుంది. బాదం బటర్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తాయి. ఫలితంగా రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటాం.

కావాల్సినవి:
ఒక పండిన అరటిపండు
ఒక టేబుల్ స్పూన్ బాదం బటర్
ఒక కప్పు పాలు (ఆవు పాలు లేదా బాదం పాలు)
ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్


తయారీ:
ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్లో వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీని ఉదయం పూట తాగండి.

2. బెర్రీ & యోగర్ట్ స్మూతీ:
ఈ స్మూతీలో ప్రొటీన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ మీ చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

కావాల్సినవి:
అర కప్పు మిక్స్డ్ బెర్రీస్ (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ)
అర కప్పు గ్రీక్ యోగర్ట్ (ప్రొటీన్ కోసం)
అర కప్పు పాలు లేదా నీరు
ఒక టేబుల్ స్పూన్ తేనె (రుచికి)

తయారీ:
అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి నురుగులా మారే వరకు బ్లెండ్ చేయండి. తర్వాత తాగండి. దీనిలోని పోషకాలు మీకు అవసరం అయిన శక్తిని అందిస్తాయి.

3. స్పినాచ్ &  పీనట్ బటర్ స్మూతీ:
పాలకూర (స్పినాచ్) ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఈ స్మూతీలో కలపడం వల్ల ప్రొటీన్‌తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది. పీనట్ బటర్ రుచిని పెంచుతుంది.

కావాల్సినవి:
ఒక కప్పు తాజా పాలకూర ఆకులు
ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్
ఒక అరటిపండు
అర కప్పు పాలు

తయారీ:
ముందుగా పాలకూరను, పాలను బ్లెండ్ చేసి.. తరువాత మిగిలిన పదార్థాలు కలిపి బ్లెండ్ చేయాలి. ఇలా తయారు చేసిన ఈ స్మూతీని ఉదయం పూట తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

4. చాక్లెట్ & ఓట్స్ స్మూతీ:
చాక్లెట్ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఓట్స్ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అంతే కాకుండా ఇది మీకు రోజంతా శక్తిని ఇస్తుంది. కోకో పౌడర్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.

కావాల్సినవి:
ఒక టేబుల్ స్పూన్ ఓట్స్
ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్
ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ లేదా బాదం బటర్
అర కప్పు పాలు
కొద్దిగా తేనె లేదా ఖర్జూర పండు (తియ్యదనం కోసం)

తయారీ:
ముందుగా ఓట్స్‌ని కొంతసేపు నానబెట్టి, తరువాత అన్ని పదార్థాలతో కలిపి బ్లెండ్ చేయాలి.

5. సన్ఫ్లవర్ సీడ్ & మ్యాంగో స్మూతీ:
ఈ స్మూతీ కొంచెం భిన్నంగా.. చాలా రుచికరంగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్‌లో మంచి కొవ్వులు, ప్రొటీన్ ఉంటాయి. మామిడిపండు రుచిని, పోషకాలను అందిస్తుంది.

కావాల్సినవి:
ఒక కప్పు తాజా మామిడి గుజ్జు
ఒక టేబుల్ స్పూన్ సన్ ఫ్లవర్ సీడ్స్
అర కప్పు పాలు లేదా కొబ్బరి పాలు
కొద్దిగా తేనె

తయారీ:
ఈ పదార్థాలన్నింటినీ ఒక బ్లెండర్లో వేసి.. మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. ఉదయం పూట ఈ స్మూతీ క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ స్మూతీలను రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఇతర పోషకాలు అందుతాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం, కేవలం ఐదు నిమిషాలలో సిద్ధం చేసుకోవచ్చు. వీటితో మీరు రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

Related News

Vitamins For Hair Growth: జుట్టు పెరగడానికి ఏ విటమిన్లు అవసరం ?

Health Tips: మీరు తగినంత నిద్ర పోవడం లేదని తెలిపే.. సంకేతాలివే !

Blood Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అస్సలు లైట్ తీసుకోవద్దు, బ్లడ్ క్యాన్సర్ కావొచ్చు

Fruit Peels: ఇకపై పడేయొద్దు! ఈ పండ్ల తొక్కలతో.. బోలెడు ప్రయోజనాలు

Orange Vs Amla: నారింజ Vs ఉసిరి.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ?

Foot Pain: అరికాళ్లలో నొప్పులా.. క్షణాల్లోనే సమస్య దూరం !

Health tips: ఉడికించిన శనగల్లో ఇవి కలిపి తింటే.. పోషకాలు డబుల్

Big Stories

×