Bollywood Ramayan: భారతీయ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే. రామాయణం గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ రామాయణం గురించి సరికొత్త సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి (Nitesh Tiwari)దర్శకత్వంలో రామాయణ (Ramayana) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi)ప్రధాన పాత్రలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించబోతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. బీఫ్ తినే వ్యక్తి రాముడిగా నటించడమా? అంటూ రణబీర్ కపూర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఈ పాత్ర కోసం రణబీర్ కపూర్ ను ఎంపిక చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా చిత్ర బృందం వెల్లడించారు. తాజాగా రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం గురించి వచ్చిన విమర్శలపై సద్గురు(Sadhguru) స్పందించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా సద్గురు అందరికీ ఎంతో సుపరిచితమే.
తాజాగా సద్గురు నటుడు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటించడం గురించి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గతంలో రణబీర్ కపూర్ నటించిన పాత్రలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన రాముడి పాత్రలో నటించకూడదని చెప్పటం సరికాదు. భవిష్యత్తులో తాను రాముడి పాత్రలో నటిస్తాననే విషయం ఆయనకు తెలిసి ఉండదు. ఈరోజు రాముడి పాత్రలో నటించిన రణబీర్ కపూర్ రేపు రావణాసురుడి పాత్రలో కూడా నటించవచ్చు కదా.. ఇలా గత పాత్రలను దృష్టిలో పెట్టుకొని రాముడి పాత్ర చేయకూడదు అనడం సరైంది కాదు అంటూ స్వయంగా సద్గురు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
రావణాసురుడు పాత్రలో యష్..
ఇటీవల రామాయణ సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రతో జరిగిన సంభాషణలో భాగంగా ఈ విషయం ప్రస్తావనకు రావడంతో సద్గురు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అదేవిధంగా రావణాసురుడి పాత్రలో నటిస్తున్న యష్(Yash) గురించి కూడా సద్గురు స్పందించారు. రావణాసురుడి పాత్రలో నటించడానికి యష్ పూర్తిగా అర్హుడని తెలిపారు. ఇక ఈ సినిమాలో యశ్ రావణాసురుడిగా విలన్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఇక సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఏకంగా 4 వేల కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Anil Ravipudi: అనిల్ రావిపూడితో రామ్ పోతినేని.. రంగంలోకి బడా ప్రొడ్యూసర్?