Samyuktha Menon: ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha Menon)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ఇకపోతే ఈరోజు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు కావడంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె లైనప్ కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
1995 సెప్టెంబర్ 11న కేరళ పాలక్కాడ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. తొలిసారి 2016లో మలయాళ చిత్రం ‘పాప్ కార్న్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2019లో వచ్చిన ‘కల్కి’ సినిమాతో మలయాళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. 2022లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా(Rana )కాంబినేషన్లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రానా భార్యగా తన నటనతో అబ్బురపరిచింది. ‘బింబిసార’ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈమె.. ‘విరూపాక్ష’ సినిమాతో ఊహించని పాపులారిటీ అందుకుంది. అంతేకాదు ‘సార్’ అనే బైలింగ్వల్ మూవీతో తెలుగు ప్రేక్షకులను, అటు తమిళ్ ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. చేతిలో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
సంయుక్త మీనన్ చిత్రాలు..
ప్రస్తుతం యంగ్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంయుక్త మీనన్.. చేతిలో ఏకంగా 8 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒక్క తెలుగులోనే 5 చిత్రాలు కావడం గమనార్హం. మరొకవైపు ఒక తమిళం, ఒక హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇవన్నీ కూడా ఇప్పుడు సెట్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈమె నటిస్తున్న చిత్రాల విషయానికొస్తే.. బాలకృష్ణ అఖండ 2 : తాండవం, స్వయంభు, నారి నారి నడుమ మురారి, బెంజ్ తోపాటు మరో తెలుగు మూవీకి కూడా సైన్ చేసింది. అలాగే ఒక మలయాళం చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ అమ్మడి లైనప్ చూసి అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సంయుక్త కెరియర్..
సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే మలయాళ నటీమణులలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న ఈమె .. కొచ్చి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో 2018, 2019 రెండింటిలో కూడా 7వ స్థానంలో నిలిచింది.అలాగే 2020లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2023 లో సంయుక్త తన పేరు నుండి మీనన్ అనే ఇంటి పేరును తొలగించి..” నేను సమానత్వం, మానవత్వం అలాగే ప్రేమను అంతటా చూడాలనుకున్నప్పుడు.. ఇంటిపేరు ఉంచుకోవాలని అనుకోవడం లేదు. అందుకే నా ఇంటి పేరును తీసేస్తున్నాను” అంటూ ఒక కార్యక్రమంలో తెలిపింది. అలా ఎప్పటికప్పుడు అందరిలో ఒకరిగా చలామణి అవుతూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ: Lavanya Tripathi: ఒకవైపు తల్లిగా ప్రమోషన్.. ఇంకొకవైపు మూవీ విడుదల.. లావణ్య రియాక్షన్ ఇదే!