Akhil Lenin Movie Heroine: ప్రస్తుత కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక డేట్ కి సినిమా రిలీజ్ అనౌన్స్ చేస్తే, ఎన్ని ఇబ్బందులు పడి అయినా కూడా అదే డేట్ కు సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పోతుందేమో అని ముందు జాగ్రత్త కోసం అనౌన్స్ చేస్తున్నారు. ఆ టైం కి సినిమాకి సంబంధించిన పనులు జరగకపోతే చాలా ఈజీగా వాయిదా వేస్తున్నారు. అలానే కొంతమంది సినిమా నటులను కూడా ముందుగా అనౌన్స్ చేసి ఆ తర్వాత వాళ్లకు ఉన్న కారణాల వలన వాళ్లను కూడా మార్చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు ఒక హీరోతో సినిమాను అనౌన్స్ చేసి కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు జరగడం లేదు అని చెప్పి మరో హీరో వద్దకు వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొంతమంది కొంతవరకు షూటింగ్ జరిపి కూడా ఆ తరువాత ఆర్టిస్టులను మార్చేస్తుంటారు.
లెనిన్ సినిమా నుంచి హీరోయిన్ అవుట్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కానీ ఆమెకు మాత్రం అవకాశాలు వరుసగా వరించాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి హీరోల పక్కన కూడా చేసే ఛాన్స్ కొట్టేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఆమె పలు సినిమాలు చేస్తున్నట్లు అనూస్ కూడా చేశారు. ఆమె నటించిన ఆదికేశవ, గుంటూరు కారం వంటి సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. అయితే అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వలన ఆమె సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీ లీలా ప్లేస్ లో ప్రస్తుతం భాగ్యశ్రీ ను తీసుకుంటున్నారు. దీని గురించి అధికార ప్రతి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంటర్ ఇచ్చింది భాగ్యశ్రీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించక పోయినా కూడా ఆమెకు మాత్రం మంచి పేరు లభించింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కింగ్డమ్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం అదే ప్రొడక్షన్ హౌస్ లో లెనిన్ సినిమా తెరకెక్కుతుంది కాబట్టి. ఈ సినిమాలో కూడా శ్రీ లీల ప్లేస్ లో భాగ్యశ్రీను తీసుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీనిని అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు. మొత్తానికి సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఈవిడ హీరోయిన్ గా సెటిల్ అయిపోతుందా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Manchu Vishnu : మంచు విష్ణు కార్యాలయంపై ఐటి రైడ్స్