OTT Movie : ఓటీటీలో ఇప్పుడు హారర్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. థియేటర్లకు వెళ్ళకుండా ఓటీటీనే ఫాలో అవుతున్నారు. వీటిలో ఉండే హారర్ సీన్స్ కి, సస్పెన్స్ ఎలిమెంట్స్ కి ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక యువకుడికి దెయ్యం ఆవహిస్తుంది. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ఘటికాచలం’ (Ghatikachalam). 2025 లో వచ్చిన ఈ సినిమాకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు. ఇందులో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి, ఆర్వికా గుప్తా, తన్మయి ఖుషి, అర్జున్ విహాన్, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం.సి. రాజు నిర్మాణంలో, మారుతి ఎస్‌కెఎన్ సమర్పణలో ఓయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. 2025 మే 31న థియేటర్లలో విడుదలైన ఈసినిమా జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా (aha) లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందినట్లు చెప్పబడినప్పటికీ, ఇది ఒక కల్పిత కథగా పరిగణించబడింది. ఇది హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. IMDb లో ఈ సినిమాకి 5.8/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
కౌశిక్ అనే యువకుడు తన తండ్రి కోసమే మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. డాక్టర్ కావాలనే కల అతనికి ఏ మాత్రం ఉండదు. కౌశిక్ తండ్రి ఒకప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటాడు. కాని అది కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు కౌశిక్ ద్వారా అతని తీరని కలను సాకారం చేసుకోవాలనుకుంటాడు. ఇక కౌశిక్ తండ్రి అతని కెరీర్‌ను ఒక మార్గంలో పెట్టాలనుకుంటాడు. అయితే కౌశిక్ ఇష్టాలను ఎవరూ పట్టించుకోరు. అతనికి నచ్చిన ఫుడ్ కూడా తినే పరిస్థితి ఇంట్లో ఉండదు. కౌశిక్ కాలేజ్ లో నిరంతరం బుల్లీయింగ్‌కు గురవుతూ, ఒంటరి తనానికి అలవాటు పడతాడు. ఒక రోజు కాలేజ్ లో జరిగిన ఒక సంఘటన వల్ల అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. అతనిలో ఒక వింత వాయిస్, తనను “ఘటికాచలం”గా పరిచయం చేసుకుంటుంది.
ఈ వాయిస్ మొదట చిన్న చిన్న ఆదేశాలు ఇస్తుంది. కానీ క్రమంగా, ఈ వాయిస్ బలంగా మారి, కౌశిక్‌ను పూర్తిగా నియంత్రించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అతని ప్రవర్తన ప్రమాదకరంగా మారుతుంది. అతని కుటుంబం మారుతున్న కౌశిక్ ప్రవర్తనను చూసి భయపడతారు. ఒకరోజు ఇంట్లో పంది మాంసం కావాలని అడుగుతాడు. అది తినేటప్పుడు కౌశిక్ ప్రవర్తన చూసి మరింత భయపడతారు. కౌశిక్ కుటుంబ సభ్యులు అతన్ని మొదట డాక్టర్ శ్రద్ధ అనే సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తారు. ఆమె కౌశిక్‌కు మానసిక సమస్య ఉందని నిర్ధారిస్తుంది. అతనికి మనసును నియంత్రణలో పెట్టుకోమని సలహా ఇస్తుంది. అయితే ఆ తరువాత కూడా కౌశిక్ పరిస్థితి మరింత దిగజారడంతో, ఈ సారి ఆధ్యాత్మిక చికిత్సల వైపు కౌశిక్ ను తెసుకెళ్తారు. వీళ్ళు మొదట ఒక ముస్లిం షమన్‌ను, ఆ తర్వాత పాణిగ్రహి అనే తాంత్రికుడిని సంప్రదిస్తారు.
ఘటికాచలం అనే ఈ దుష్ట శక్తి కౌశిక్ ను ఆవహిస్తూ, అతనిలో అణచివేయబడిన ఎమోషన్స్ ను ఉపయోగించుకుంటుందని తెలుసుకుంటారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఘటికాచలం ఎవరో బయటికి వస్తుంది. ఇది కౌశిక్ జీవితంలోని ఒక విషాద సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఈ శక్తి కౌశిక్‌ను రక్షించాలని కోరుకుంటుందా లేక అతనిని నాశనం చేయాలని కోరుకుంటుందా అనే సస్పెన్స్ కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. కౌశిక్ తన మానసిక సమస్యతో పాటు, ఈ అతీంద్రియ శక్తి చేతిలో చిక్కుకుంటాడు. అతని కుటుంబం ఈ శక్తి నుండి అతనిని రక్షించడానికి చేసే ప్రయత్నంలో ఒక రహస్య ప్రదేశానికి వెళ్తుంది. ఇక క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో ఆశ్చర్యపరుస్తుంది. చివరికి కౌశిక్ అతీంద్రియ శక్తి నుంచి బయటపడతాడా ? ఇంతకీ ఘటికాచలం ఎవరు ? అతని గతం ఏమిటి ? కౌశిక్ తల్లిదండ్రులు ఈ శక్తిని ఎలా ఎదుర్కుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇది అమ్మాయిల కథ కాదు మావా అరాచకం … ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ