BigTV English

Ismart Shankar : మార్ ముంతా..చోడ్ కెరీర్.. హిట్ సినిమా చేయడమే వదిలేశారు

Ismart Shankar : మార్ ముంతా..చోడ్ కెరీర్.. హిట్ సినిమా చేయడమే వదిలేశారు

Ismart Shankar : ఈ రోజుల్లో హిట్ సినిమా తీయటం అనేది మామూలు విషయం కాదు. ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందో ఏ సినిమా నచ్చదు ఎవరు ఊహించలేరు. కొన్ని సందర్భాలలో ఈ సినిమా బీభత్సమైన హిట్ అవుతుంది అని బలంగా నమ్ముతారు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిపోతుంది. ఏమీ లేని సినిమాలు కూడా కొన్నిసార్లు హిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి హిట్టు ప్లాప్ అనేవి మన చేతుల్లో ఉండవు.


బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాథ్. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన బాచి సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.

మార్ ముంతా..చోడ్ కెరీర్..


ఈ డైలాగ్ కొంచెం కొత్తగా ఉంది కదా.. అలానే ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలోని ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. అలానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 80 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా వచ్చి నేటికి ఆరేళ్లు అయింది. ఈ సినిమా వచ్చిన తర్వాత అటు హీరో రామ్ కి కానీ, మరోవైపు పూరి జగన్నాథ్ కి గాని సరైన హిట్ సినిమా పడలేదు. ఈ సినిమా తర్వాత పూరి రెండు సినిమాలు చేశాడు ఆ రెండు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. చోడ్ కెరీర్.. అనే డైలాగ్ లా… వీళ్ళ పరిస్థితి చూస్తుంటే కెరీయర్ ను వదిలేశారు అనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం వీరిద్దరూ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తారు అనే నమ్మకం చాలా మందికి ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

ఆంధ్ర కింగ్ తాలుకా, భిక్షాందేహి 

ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాను చేస్తున్నాడు. మరోవైపు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి హీరోగా భిక్షాందేహి అని సినిమాను చేస్తున్నారు. అయితే ఈ టైటిల్ పైన ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్లు పైన కూడా మంచి నమ్మకాలు అయితే ప్రేక్షకులకు ఉన్నాయి. అయితే అవి ఏ స్థాయిలో వీరిద్దరూ నిలబెట్టుకుంటారు వేచి చూడాలి. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రం రామ్ కెరియర్ కి మంచి ప్లస్ పాయింట్. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా రామ్ ఆటిట్యూడ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. ఈ సినిమాకి సీక్వెల్ గా చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ గా మిగిలింది.

Also Read : Garividi Lakshmi : గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్, ఆసక్తి రేకిస్తున్న ఫస్ట్ లుక్

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×