BigTV English

Garividi Lakshmi : గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్, ఆసక్తి రేకిస్తున్న ఫస్ట్ లుక్

Garividi Lakshmi : గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్, ఆసక్తి రేకిస్తున్న ఫస్ట్ లుక్

Garividi Lakshmi : ఉత్తరాంధ్ర కళాకారుని గరివిడి లక్ష్మి జీవిత కథను ఆధారంగా తీసుకొని గరివిడి లక్ష్మి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఎన్నో సినిమాలను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటువంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు ఎంచుకుంది అనగానే చాలామందికి క్యూరియాసిటీ పెరిగింది. అన్నిటిని మించి ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారి కుమార్తె కృతి ప్రసాద్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు అంటే ఆసక్తి ఇంకొంచెం పెరిగింది.


ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అలానే యంగ్ ప్రొడ్యూసర్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్, వైజయంతి బ్యానర్, అలానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కృతి ప్రసాద్ ఇలా కొత్త తరం నిర్మాతలు వస్తున్నారు. కొత్త కథలకు శ్రీకారం చుడుతున్నారు.

గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ రిలీజ్ 


గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గరివిడి లక్ష్మి ఎలా ఉంటుంది ఆవిడ ఏం చేస్తుంది అనే పూర్తి అవగాహన అందరికీ లేకపోవచ్చు కానీ ఉత్తరాంధ్ర ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. అయితే గరివిడి లక్ష్మి ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. ఆ పేరు బాగా పాపులర్ అయింది. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ గరివిడి లక్ష్మి సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలి. ఈ పోస్టర్ చూస్తుంటే కొంచెం పిరియాడిక్ సినిమా ఫీల్ తీసుకొస్తుంది. ఎందుకంటే గరివిడి లక్ష్మి గెటప్, ఆ కాలంలో ఉండే రిక్షాలు, అలానే ఆమె పట్టుకున్న హార్మోనియం. ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. మొత్తానికి కొన్ని మంచి కాన్సెప్ట్ సినిమాలు ఎలా అయితే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నయో, అలానే ఈ సినిమా కూడా సంపాదించుకుంటుంది అని కొంతమంది సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో కొత్త దర్శకుడు 

ఈ సినిమాతో గౌరి నాయుడు జమ్ము అని ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి నల్ల జీలకర్ర మొగ్గ అనే పాట రిలీజ్ అయి మంచి ఆదరణ పొందుతుంది. దాదాపు మూడు మిలియన్స్ కు పైగా ఈ పాటకు వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. చరణ్ అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయాల అవసరం లేదు. ఎన్నో యూట్యూబ్ సాంగ్స్ కి ఈయన కంపోజ్ చేశారు. పొలిటికల్ సాంగ్స్ చేయడంలో కూడా ఈయన మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాకి ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. బేబీ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన సురేష్ ఈ సినిమాకి ఆర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×