E-Paper
Advertisement

ముగింపు ఎప్పుడు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే విచారణ!

ముగింపు ఎప్పుడు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే విచారణ!
Advertisement

Allu Arjun:సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప సీక్వెల్ ‘పుష్ప 2’ సృష్టించిన సంచలన విజయం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఉన్నత శిఖరాలకు చేర్చింది అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ సినిమా ప్రీమియర్ షో సమయంలోనే ఇబ్బందుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులోని సంధ్యా థియేటర్ కు రావడమే ప్రధాన కారణం.. ముఖ్యంగా అభిమాన హీరోని చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో ఒక మహిళ అభిమాని అక్కడికక్కడే మరణించడం, ఆమె కొడుకు హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే కీలక విచారణ..

దీంతో అల్లు అర్జున్ తో పాటు ఆయన బౌన్సర్లు 23 మందిపై పోలీస్ కేసు నమోదు అయింది. ఇకపోతే ఈ కేసు నమోదు అయి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేసుకి ముగింపు ఎప్పుడు? అని అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసుకు సంబంధించి కమిటల్ బాండ్ ప్రక్రియ నేపథ్యంలో నిందితులందరూ కూడా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గత విచారణలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టు మందు హాజరయ్యారు. ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుల్లో ఇద్దరు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను నాంపల్లి కోర్టు నేటికీ (జూలై 6) వాయిదా వేసింది.

Advertisement

also read:రీరిలీజ్ కి సిద్ధమైన పవర్ స్టార్ మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ మూవీ.. ఎప్పుడంటే?

23 మంది వస్తారా?

ఇకపోతే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. వారందరూ కోర్టుకు హాజరైన తర్వాతే తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించాలని న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. అందుకే నేటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే అల్లు అర్జున్ కూడా ఈరోజు జరిగే విచారణకు ప్రత్యక్షంగా హాజరు కాకుండా వర్చువల్ విధానంలోనే హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

ప్రశ్నార్ధకంగా మారిన బన్నీ రాక..

Advertisement

ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ముంబైలో జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన తన సినిమా షూటింగ్ పక్కన పెట్టి, నిర్మాతలకు నష్టం కలిగించి కోర్టుకు హాజరవుతారనే నమ్మకాలు అయితే లేవు. కాబట్టి ఆయన వర్చువల్ గానే కోర్టుకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు రోజురోజుకీ వాయిదా పడుతుండడంతో అటు బాధితులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసు ముగింపు ఎప్పుడు పలుకుతుందో తెలియాల్సి ఉంది.

Related News

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

Big Stories

Advertisement
×