E-Paper
Advertisement

పెళ్లిరోజే విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్!

పెళ్లిరోజే విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్!
Advertisement

Tollywood:ఎవరైనా సరే పెళ్లి రోజున సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు.. అబ్బాయిలైతే తమ భార్యల నుండి వాచ్ , డ్రెస్, బైక్, కార్ ఇలా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు.. అదే అమ్మాయిలైతే మంచి చీర, నెక్లెస్, ప్రాపర్టీ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ కి మాత్రం చేదు అనుభవం ఎదురయ్యింది. పెళ్లిరోజున స్పెషల్ సర్ప్రైజ్ అంటూ ఆమె భర్త తీసుకొచ్చిన గిఫ్ట్ ఆమెనే కాదు యావత్ సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచేసింది. మరి ఆమె భర్త ఆమెకు ఇచ్చిన ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి? అంతలా ఆశ్చర్యపోవడానికి ఆ అక్కడ ఏముంది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

15 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు హీరోయిన్..

ఒకప్పుడు అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఉర్రూతలూగించిన ఆ హీరోయిన్ కి బర్తడే రోజున ఆమె భర్త ఇచ్చిన సర్ప్రైజ్ చూసి నోరెళ్లబెట్టింది. ఆ గిఫ్ట్ చూసి ఏం చేయాలో తెలియక కన్నీటి పర్యంతమయింది.. పైగా సర్ప్రైజ్ గిఫ్ట్ పిల్లల చేత చదివించుకొని మరీ తెలుసుకొని నివ్వెర పోయింది. ఆమె ఎవరో కాదు మిస్ ఇండియాగా తలపై కిరీటాన్ని ధరించి అందరి దృష్టిని ఆకట్టుకొని.. మంచు విష్ణు సరసన సూర్యం సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సెలీనా జైట్లీ (Celina Jaitly). కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హగ్ ను వివాహం చేసుకొని విదేశాల్లో స్థిరపడింది. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఈమె.. మళ్లీ 15 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వైవాహిక జీవితంలో అనుభవించిన నరకాన్ని బయటపెట్టింది.

కట్టుకున్న భర్తే కాలయముడు..

Advertisement

తన 15వ వివాహ వార్షికోత్సవం రోజున జరిగిన ఒక దారుణమైన ఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. సెలీనా మాట్లాడుతూ.. “నా భర్త కారులో తీసుకెళ్లి ఒక కొండ కింద నిర్మానుషమైన రోడ్డుపై నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. బాధతో అక్కడి నుండి నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాను. ఇంటికి వెళ్ళాక ఆస్ట్రియా పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చిన ఒక లేఖ కనిపించింది. అయితే ఆ లేఖ జర్మన్ భాషలో ఉండడంతో నా పిల్లలైన విరాజ్, విన్ స్టన్ లకు ఇచ్చి చదవమన్నాను. వాళ్లు ఆ లేఖ చదవగానే నా ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఎందుకంటే నా పెళ్లి రోజు కానుక పేరిట నా భర్త నాకు విడాకుల నోటిస్ పంపించారు. నా కన్నబిడ్డల నోట నాపై నా భర్త చేసిన దారుణమైన ఆరోపణలను వినాల్సి రావడం జీవితాంతం మర్చిపోలేని పెద్ద గాయం.

అర్ధరాత్రి ప్రాణభయంతో పారిపోయాను..

కోర్టు మొదటి విచారణలోనే ఇద్దరూ సామరస్యంగా విడిపోవాలని సూచించినప్పటికీ.. అప్పటికే నేను తీవ్రమైన మానసిక ఒత్తిడి , ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాను. నా అకౌంట్ లో డబ్బులు లేవు. అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం భర్త ఆస్తిలో రూపాయి కూడా కావాలని నేను కోరలేదు. పెళ్లికి ముందు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను మాత్రమే తిరిగి ఇవ్వాలని కోరాను. పిల్లల సంరక్షణ బాధ్యతను కూడా కావాలని అడిగాను. అయితే ఆ తర్వాత పరిస్థితులు నరకంగా మారిపోయాయి. నా ఇంట్లోనే బందీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగం చేయాలని ఒత్తిడి తెస్తూ సూపర్ మార్కెట్లో క్లీనర్ గా కూడా పనిచేయాలని నా భర్త ఒత్తిడి తెచ్చారు. చివరికి ప్రాణాలు దక్కించుకోవడానికి 2025 నవంబర్లో అర్ధరాత్రి పిల్లలతో కలిసి ఇండియాకి వచ్చేసి ముంబై కోర్టులో గృహహింస కేసు దాఖలు చేశాను.

Advertisement

ALSO READ:ముగింపు ఎప్పుడు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే విచారణ!

నా పిల్లల్ని నాకు కాకుండా చేశాడు..

ముఖ్యంగా నా భర్త పీటర్ హగ్ పై గృహహింస, క్రూరత్వం, మోసపూరత చర్యల కింద కేసు నమోదు చేసి, రూ.10లక్షల భరణంతో పాటు రూ.50 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేశాను. ప్రస్తుతం ఆస్ట్రియా ఫ్యామిలీ కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ పిల్లల్ని ఒక రహస్య ప్రాంతానికి తరలించి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి నాతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాడు. నా ముగ్గురు పిల్లలను నాకు కాకుండా చేశాడు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సెలీనా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Related News

ముగింపు ఎప్పుడు.. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేడే విచారణ!

రీరిలీజ్ కి సిద్ధమైన పవర్ స్టార్ మోస్ట్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ మూవీ.. ఎప్పుడంటే?

చిక్కుల్లో పడ్డ మోహన్ లాల్.. ఉత్కంఠగా రేకెత్తిస్తున్న హైకోర్టు విచారణ!

AIswarya Lakshmi :హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఏం చదివిందో తెలుసా..? అస్సలు ఊహించిఉండరు..

మీరు ఆట మొదలుపెట్టారు.. ముగింపు ప్రజలే ఇస్తారు.. మరో సంచలన వీడియోతో ప్రకాష్ రాజ్!

Producer : సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

“అయ్యగారు అఖిల్”కి అభిమాని కొత్త పేరు.. భలే ఉందే!

Big Stories

Advertisement
×