E-Paper
Advertisement

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?
Advertisement

Ramayana Collections : బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ ఇతిహాస చిత్రం రామాయణ మూవీ ఇటీవలే భారీ అంచనాలతో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మూడు రోజుల క్రితం నవంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రామాయణ కథతో పాటుగా విజువల్ వండర్ గా వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మొదటి రోజు నుంచి మూవీకి భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. అంతేకాదు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా 3 రోజులకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుందో ఒకసారి తెలుసుకుందాం..

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రామాయణ మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. దేవుడి కథతో వచ్చిన సినిమా కావడంతో ఎక్కువ మంది సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు దాంతో రోజురోజుకీ టికెట్ల బుకింగ్స్ పెరిగిపోతున్నాయి అని టాక్ వినిపిస్తుంది. దీంతోపాటుగా కలెక్షన్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. గత రెండు రోజులతో పోలిస్తే మూడో రోజు కూడా కలెక్షన్లు భారీగా పెరిగాయని తెలుస్తుంది. రెండవ రోజు రూ. 102 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తర్వాత, శనివారం నాడు కూడా వసూళ్లలో ఈ సినిమా బలమైన కలెక్షన్స్ ను నమోదు చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హిందీ వెర్షన్ రూ. 50 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించగా, సౌత్ డబ్బింగ్ వెర్షన్లు సుమారు రూ. 20 కోట్ల నికర వసూళ్లను అందించాయి అటు ఓవర్సీస్ లో కూడా సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే జోరులో కలెక్షన్స్ రాబడితే మాత్రం సినిమా 5 వేల కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మరి ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి..

రామాయణ సినిమా..

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణుడి పాత్రలో నటించగా, బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రామాయణ’. రెండవ రోజు రూ. 102 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తర్వాత, శనివారం నాడు కూడా వసూళ్లలో ఈ సినిమా బలమైన కలెక్షన్స్ ను నమోదు చేసింది. మూడు రోజు 150 కోట్ల వసూళ్లను అందుకున్న ఈ మూవీ ఈ వీకెండ్ భారీగా కలెక్షన్లను అందుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదే జోరుతో మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం ఈ సినిమా 5000 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసి అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా రెండో భాగం కూడా దాదాపు పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే వచ్చే ఏడాది మార్చిలో సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.. మరి రెండో భాగం ఎలాంటి టాక్ని అందుకుంటుందో అన్నది ఇప్పటినుంచే సస్పెన్స్ గా మారింది.

Also Read :‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?

Related News

‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

Big Stories

Advertisement
×